Extra Ordinary Man Movie Review | ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ –రివ్యూ {2.25/5}

Extra Ordinary Man Movie Review | ‘భీష్మ’ తర్వాత 4 ఫ్లాపులు ఎదుర్కొని గాడి తప్పిన నితిన్ తిరిగి తనకి సక్సెస్ నిచ్చే కామెడీకి తిరిగొచ్చాడు. రచయిత- దర్శకుడు వక్కంతం వంశీతో కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ ప్రయత్నించాడు.

Advertisement
Update:2023-12-08 17:46 IST

Extra Ordinary Man Movie Review | ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ –రివ్యూ

చిత్రం: ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్

రచన – దర్శకత్వం: వక్కంతం వంశీ

తారాగణం: నితిన్, శ్రీలీల, రాజశేఖర్, రావు రమేష్, , సుధేవ్ నాయర్, రోషిని, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, హైపర్ ఆది తదితరులు

సంగీతం : హెరిస్ జయరాజ్, ఛాయాగ్రహణం : ఆర్థర్ ఏ విల్సన్, సాయి శ్రీరామ్, యువరాజ్

బ్యానర్ : శ్రేష్ట మూవీస్, నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి

విడుదల : డిసెంబర్ 8, 2023

రేటింగ్: 2.25/5

‘భీష్మ’ తర్వాత 4 ఫ్లాపులు ఎదుర్కొని గాడి తప్పిన నితిన్ తిరిగి తనకి సక్సెస్ నిచ్చే కామెడీకి తిరిగొచ్చాడు. రచయిత- దర్శకుడు వక్కంతం వంశీతో కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ ప్రయత్నించాడు. ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీలతో తను కూడా ఓ సినిమా నటించి అయిందనిపించాడు. సీనియర్ హీరో రాజశేఖర్ తో కలిసి పనిచేసే అవకాశం కూడా లభించింది. మరి ఇంత ఆకర్షణీయంగా కన్పిస్తున్న ప్రయత్నంలో నిజంగా ఎక్స్ ట్రార్డినరీ సినిమానే నటించాడా? కామెడీ ప్రధానంగా సాగే సినిమాలో కామెడీ ఎంత? ఇవి తెలుసుకుందాం...

కథ

అభి (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా స్ట్రగుల్ చేస్తూంటాడు. ఒక కంపెనీ బాస్ అయిన లిఖిత (శ్రీలీల) తనతో ప్రేమలో పడ్డాక ఆమె కంపెనీలో ఉద్యోగమిస్తుంది. ఆ ఉద్యోగంలో సీఈఓ స్థాయికి ఎదుగుతాడు. ఇంతలో ఓ దర్శకుడు వచ్చి కథ చెప్పి హీరోగా ఆఫర్ ఇస్తాడు. ఆ సినిమా కథ ఆంధ్రా -ఒరిస్సా సరిహద్దు గ్రామంలో నిజంగా జరిగిన కథ. నీరో (సుదేవ్) అనే విలన్ ఆట కట్టించడానికి సైతాన్ అనే పోలీసు చేసే సహసాలతో కూడిన కథ. ఈ కథ నచ్చి హీరోగా నటించడానికి ఒప్పుకుంటాడు. అయితే ఆ దర్శకుడు అభిని కాదని వేరే హీరోతో సినిమా ప్రారంభిస్తాడు. ఇప్పుడు అభికి విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. ఆ కథలో వున్న విలన్ నీరోతోనే నిజంగా తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో దొంగ పోలీసుగా ఆ గ్రామానికి వెళ్ళి నీరో బారినుంచి అక్కడి ప్రజల్ని కాపాడ్డం మొదలెడతాడు. ఇదీ కథ.

ఎలా వుంది కథ

ఐడియా బాగానే వుంది. 2004 లో విడుదలైన రాజీవ్ కనకాల నటించిన హార్రర్ ‘ఏ ఫిలిమ్ బై అరవింద్’ లో సినిమా స్క్రిప్టు ప్రకారం సంఘటనలు జరిగినట్టు- ఈ కథలోని సినిమా కథలో విలన్ తో తలపడే ఐడియా కామెడీకి భిన్నంగానే వుంది. అయితే ఐడియా మాత్రమే భిన్నంగా వుండి దాంతో కథ సున్నంగా వుంటే ఎన్ని ఆకర్షణలు జోడించినా లాభముండదు. ఈ మధ్య సినిమాలు వరుసగా సెకండాఫ్ సున్నం రాసేస్తున్నాయి. ఇది కూడా ఏమీ తీసిపోలేదు, సెకండాఫ్ సున్నం.

ఫస్టాఫ్ జూనియర్ ఆర్టిస్టుగా స్ట్రగుల్ చూపిస్తూ ఇంట్లో తండ్రితో చీవాట్లు వగైరా సాగీస్తూ, హీరోయిన్ శ్రీలీలతో లవ్ ట్రాక్ మొదలుపెట్టాక, ఈ అరిగిపోయిన మూస ఫార్ములా టెంప్లెట్ ప్రేమ పేలవంగా సాగుతుంది. ఒక జూనియర్ ఆర్టిస్టు అయిన నితిన్ శ్రీలీల కంపెనీకి సీఈఓ గా ఎదగడం ఒక అతి కాగా, ఇన్ కం టాక్స్ అధికారులతో మేధావిలా మాట్లాడ్డం మరీ అతిగా అనిపిస్తుంది. జూనియర్ ఆర్టిస్టుని ఎక్స్ ట్రార్డినరీ మాన్ గా చూపించే ప్రయత్నంలో సాధ్యాసాధ్యాల్ని పూర్తిగా వదిలేశారు.

ఇలాగే దొంగ పొలీసుగా గ్రామం వెళ్ళి అధికారులతో వ్యవహరించే తీరు కూడా . ఇవన్నీ కామెడీకోసం లాజిక్ చూడకుండా ఎంజాయ్ చేసినా, శ్రీలీలతో ప్రేమలో పడ్డాక స్పూఫ్ లు మొదలవుతాయి. ఈ స్పూఫ్ లు కథలో ఇమడని సపరేట్ ట్రాకులు. ఒక బాలకృష్ణ స్పూఫ్, నరేష్ -పవిత్రా లోకేష్ ల పెళ్ళి గురించి ఇంకో స్పూఫ్, విజయ్ దేవరకొండ - రశ్మికల లవ్ గురించి మరింకో స్పూఫ్... ఇలా ఇక్కడ్నించే అసలు కథ మాయమైపోవడం మొదలెడుతుంది.

ఇంటర్వెల్ దగ్గర సెకండాఫ్ పట్ల ఆసక్తి రేకెత్తించినా, సెకండాఫ్ షరా మామూలే. కథ పూర్తిగా గాలిలో కలిసిపోయి క్లయిమాక్స్ వరకూ కనిపించదు. ఈ మధ్య అర్ధం పర్ధం లేని పాత్రలతో అర్ధం పార్ధం లేని కామెడీలు. విలన్ కూడా అర్ధం లేని పదార్ధమై పోతాడు. ఇలా దొంగ పోలీసుగా కూడా నితిన్ ప్రేక్షకుల్ని అలరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ‘మా క్లయిమాక్స్ కోసం అందరికన్నా ఎదురు చూసే వారెవరో తెలుసా’ అని డైలాగు వుంటుంది. క్లయిమాక్స్ కోసం ఎదురు చూసేంత ఓపిక ప్రేక్షకుల కుండాలిగా? ఇలా సెకండాఫ్ లు చూడాలంటే సినిమాలు భయపెడుతూంటే, అసలు థియేటర్లో అడుగుపెట్టే ధైర్యం మిగలాలిగా? ఓటీటీలు సినిమాల్ని దెబ్బతీయడం లేదు. సినిమాలే సినిమాల్ని దెబ్బతీసుకుంటున్నాయి.

నటనలు- సాంకేతికాలు

జూనియర్ ఆర్టిస్టుగా, దొంగగా నితిన్ పాత్రలుండాలన్న అయిడియా బాగానే వుంది. ఈ పాత్రలకి నితిన్ సరీగ్గా సరిపోయాడు. కానీ అతడి కామిక్ సెన్స్ కి తగ్గట్టు కథ అందించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నితిన్ ఎంతబాగా కామెడీ చేసినా కాసేపటి తర్వాత ఫాస్టాఫ్ లోనే ఆ కామెడీ తేలిపోవడం మొదలెడుతుంది. ఇక సినిమాని ఎలివేట్ చేయడం నితిన్ వల్ల కాలేదు.

చుట్టూ వున్న ఇతర పాత్రలూ డిటో. తండ్రి పాత్ర రావురమేష్ తో డైలాగు విసుర్లు పేలతాయి. అంతవరకే. విలన్ సుదేవ్ ది డమ్మీ పాత్రకి సరిపోయే డమ్మీ నటన. పోలీసు అధికారి పాత్రలో సీనియర్ హీరో రాజేశేఖర్ బాగానే నటించాడు. ఎలాగూ సినిమాలో చాలా స్ఫూఫ్ లున్నప్పుడు, రాజశేఖర్ పాత్రని ‘అంకుశం’ లోని హిట్టయిన పోలీసు పాత్రకి కంటిన్యూటీ ఇచ్చి, నాటి ఎస్సైని ఇప్పుడు ఉన్నతాధికారిగా చూపించాల్సింది.

ఇక ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల ఐటెమ్ గర్ల్ గా మారిపోతోందేమో. ఏ దర్శకుడూ ఆమె పాత్రని పట్టించుకోవడం లేదు. పాటల్లో డాన్సులకి వాడుకుని వదిలేస్తున్నారు. ఇందుకేనా పూజా హెగ్డే, రాశ్మికా మందన్నలు తెలుగులోంచి వెళ్ళిపోయారు?

ముగ్గురు ఛాయాగ్రాహకుల కెమెరా వర్క్ బావుంది. హెరిస్ జయరాజ్ సంగీతం ఓ మాదిరిగా వుంది. దర్శకుడు వక్కంతం వంశీ రెండో సారి కూడా గట్టి ప్రయత్నం చేయలేదు. ‘నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తర్వాత ‘నా సినిమా ఇంతే’. 


Full View


Tags:    
Advertisement

Similar News