'అల్లూరి' మూవీ రివ్యూ!

Alluri Movie Review: గత రెండు సంవత్సరాల్లో గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణా అనే మూడు సినిమాలు నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు 'అల్లూరి' తో వచ్చాడు. ఈ సారి పూర్తిగా తన ఇమేజిని సాఫ్ట్ నుంచి హార్డ్ కోర్ హీరోగా మార్చి వేయదల్చుకున్నాడు.

Advertisement
Update:2022-09-24 20:09 IST

చిత్రం: అల్లూరి

రచన - దర్శకత్వం: ప్రదీప్ వర్మ

తారాగణం : శ్రీ విష్ణు, కాయదు లోహర్, సుమన్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం : రాజ్ తోట

నిర్మాత : బెక్కెం వేణుగోపాల్

విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022

రేటింగ్ : 2.5/5

గత రెండు సంవత్సరాల్లో గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణా అనే మూడు సినిమాలు నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు 'అల్లూరి' తో వచ్చాడు. ఈ సారి పూర్తిగా తన ఇమేజిని సాఫ్ట్ నుంచి హార్డ్ కోర్ హీరోగా మార్చి వేయదల్చుకున్నాడు. పోలీస్ పాత్ర పోషించాడు. పూర్తి స్థాయి యాక్షన్ మూవీతో ప్రేక్షకులకి కొత్త అనుభవాన్నివ్వ దల్చుకున్నాడు. ఇందులో సఫలమయ్యాడా? కొత్త దర్శకుడు రొటీన్ గా వుండే పోలీసు సినిమాలకి భిన్నంగా కొత్తగా ఏం చెప్పాడు? ఇవి పరిశీలిద్దాం..

కథ

రిటైరైన పోలీసు కానిస్టేబుల్ నసీరుద్దీన్ (తనికెళ్ళ భరణి) కొడుకు ఇక్బాల్, ఎస్సై ట్రైనింగ్ కోసం మూడు సంవత్సరాలు కష్టపడినా ఉద్యోగ నియామకం జరగదు. దాంతో విరక్తి చెంది వేరే చిన్న ఉద్యోగం చేస్తూంటాడు. అప్పుడు నసీరుద్దీన్ అతడ్ని మోటివేట్ చేస్తూ, ఇన్స్ పెక్టర్ అల్లూరి (శ్రీవిష్ణు) గురించి తెలుసుకోమంటాడు. కొత్త వలస పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ ని అడిగి తెలుసుకోమంటాడు. ఇక్బాల్ ఆ కానిస్టేబుల్ ని కలుసుకుంటాడు. కానిస్టేబుల్ ఇన్స్ పెక్టర్ అల్లూరి సాహసోపేత జీవితం గురించి చెప్పుకొస్తాడు. ప్రేమ జీవితం కూడా.

అల్లూరి సీతారామరాజు అలియాస్ అల్లూరి కొత్తవలస పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాయినై, ఖాకీ దుస్తులకి విలువిస్తూ చాలా నిజాయితీగా భాద్యతలు నిర్వహిస్తూంటాడు. ఒక స్థానిక ఎంపీ అనుచరులు చేస్తున్న అరాచకాలని అడ్డుకుంటాడు. దీంతో పై అధికారులు అల్లూరిని బదిలీ చేసేస్తారు. ఎక్కడ పని చేసినా బదిలీలు తప్పవతడికి. అంత విద్రోహక శక్తులకి వ్యతిరేకంగా వుంటాడు. ఇలా వుండగా పోలీస్ కమీషనర్ (సుమన్) హైదరాబాద్ రమ్మంటాడు. అల్లూరి హైదారాబాద్ వచ్చాక యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ తో జీవితం మలుపు తిరుగుతుంది. ఈ ఆపరేషన్ ని ఎలా సక్సెస్ చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

రొటీన్ గా వచ్చే పోలీసు మాస్ కథలాగే టెంప్లెట్ లో వుంది. రొటీన్ గా వాడే విశేషణంతో 'సిన్సియర్ పోలీస్ ఆఫీసర్' పాత్ర. ఈ కథ సినిమాకోసం లేదు, శ్రీవిష్ణు టాలెంట్ ని పోలీస్ క్యారక్టర్ తో కూడా ప్రూవ్ చేయడం కోసం వుంది. అందుకని కథ వైపు చూడకుండా శ్రీష్ణు యాక్టింగ్ స్కిల్స్ ని పరిశీలించడం కోసం చూడాలి. స్థూలంగా ఇది బి,సి సెంటర్ల మాస్ యాక్షన్ సినిమా.

ఈ కథలో రెండే రెండు థ్రిల్లింగ్ సీక్వెన్సులున్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్, సినిమా ముగింపు సీక్వెన్స్. ముగింపు చాలా హార్డ్ కోర్ గా వుంటూ షాకిస్తుంది, కదిలిస్తుంది. ఈ రెండూ తప్ప మిగిలినదంతా రొటీన్ పోలీసు- విలన్ కథే. అయితే ఫస్టాఫ్ లో ఒక్కో కేసు తో ఒక్కో విలన్ మారుతూ వుంటారు. సెకెండాఫ్ మాత్రం టెర్రరిజం కథ తగిన విషయం, బలం లేక తేలిపోయి సహాన పరీక్ష పెట్టి, ముగింపులో పైకి లేస్తుంది.

టెర్రరిజం సినిమాలు ఔట్ డెటెడ్ అయిపోయాయి. ఈ మధ్య నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' కూడా ఆడలేదు. హిందీలో జాన్ అబ్రహాం నటించిన 'ఎటాక్' కూడా. కాశ్మీర్ లో తప్ప దేశంలో ఓ పదేళ్ళుగా టెర్రరిస్టు కార్యకలాపాలు లేకపోవడం కారణం. అల్ ఖాయిదా అంతరించి ఐసిస్ వచ్చాక, తాము కలలుగనే ఇస్లామిక్ సామ్రాజ్యంలో కాశ్మీర్ ని కలుపుకోవాలని అక్కడికే పరిమితమయ్యారు. తర్వాత ఇది కూడా మూలనబడి, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తున్నారు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు. కాబట్టి ఇక నక్సలిజం సినిమాల్లాగే టెర్రరిజం సినిమాల్ని బుట్ట దాఖలు చేయడం ఉత్తమం.

నటనలు -సాంకేతికాలు

పైన చెప్పుకున్నట్టు, ఇది యాక్షన్ హీరోగా కూడా పరిచయమవ్వాలని శ్రీవిష్ణు తన మీద చేసుకున్న ప్రయోగం. ఈ ప్రయోగంతో పూర్తిగా సఫలమయ్యాడు. ఇందులో సందేహం లేదు. యాంగ్రీ యంగ్ ఎస్సై! తన సాఫ్ట్ లవర్ బాయ్ ఇమేజినుంచి సీరియస్ పోలీసు క్యారక్టర్ లోకి విజయవంతమైన ప్రవేశం. అంటే ఇక మనకింకో మాస్ యాక్షన్ హీరో లభించాడన్న మాట. నిర్మాతలు ఇది నోటీసులోకి తీసుకోవాలి.

అస్సామీ హీరోయిన్ కాయదు లోహర్ మాత్రం పాటల కోసం వుంటుంది. తన అద్భుత గ్లామర్ కి తగ్గ పాత్ర లభించలేదు. ఎస్సై అల్లూరి ఈ తన ప్రేయసిని కూడా పట్టించుకుని కాస్త తన ఆపరేషన్స్ లో భాగం చేసి వుండాల్సింది. రైటర్డ్ కానిస్టేబుల్ గా తనికెళ్ళకి మాత్రం మంచి పాత్ర దక్కింది. సు మన్, రాజా రవీంద్ర, పృథ్వీలవి రొటీన్ పాత్రలే.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతంలో పాటలు చెప్పుకోగగ్గవి కాకపోయినా, చిత్రీకరణ బాగా చేశారు. అలాగే రాజ్ తోట ఛాయాగ్రహణం యాక్షన్ మూవీ మూడ్ ని ఎలివేట్ చేసేలా వుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బావుంది.

దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ పోలీస్ సినిమాని కొత్తగా చూపించడంలో ఎంతవరకూ సఫలమయ్యాడంటే, కథా పరంగా ఇంటర్వెల్, ముగింపు వరకూ సఫలమయ్యాడు. మిగిలినదంతా రొటీన్ మాస్ పోలీసు వ్యవహారమే, సీన్లే. సెకండాఫ్ టెర్రరిజం కథని యాక్షన్ తో నడపకుండా ఇన్వెస్టిగేషన్ తో నడపడంతో కుదేలయ్యింది. 'కిరోసిన్' లో పోలీస్ సినిమాని యాక్షన్ తో నడపకుండా డైలాగ్స్ తో నడిపినట్టు. ఐతే శ్రీవిష్ణు ని సీరియస్ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే విషయంలో మాత్రం పూర్తిగా సఫలమయ్యాడు దర్శకుడు.  

Tags:    
Advertisement

Similar News