అభయ్ కు నాగ్ రెడ్ కార్డ్
బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీవ్ర హెచ్చరిక
Advertisement
బిగ్ బాస్ పై వారం రోజులుగా విమర్శలు చేస్తోన్న నటుడు అభయ్ నవీన్ కు ప్రజెంటర్ నాగార్జున శనివారం రెడ్ కార్డ్ చూపించారు. వెంటనే బిగ్ బాస్ హౌస్ వీడి వెళ్లిపోవాలని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గడిచిన వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల వ్యవహారశైలి, తప్పొప్పులను శనివారం విశ్లేషించడం పరిపాటి. ఈక్రమంలోనే అభయ్ బిగ్ బాస్ పై వారం రోజులుగా విమర్శలు చేస్తున్నారని, బిగ్ బాస్ పై గౌరవం లేకపోతే హౌస్ లో ఉండల్సిన అవసరం లేదని నాగార్జున అన్నారు. గెట్ ఔట్ ఆఫ్ ది హౌస్ అని తేల్చి చెప్పారు. తన తప్పును క్షమించాలని అభయ్ ఈ సందర్భంగా వేడుకున్నారు. హౌస్ మేట్స్ కూడా అభయ్ ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ అభయ్ ను క్షమించి వదిలేస్తారా లేదా అన్నది ఈరోజు లేదా రేపు తేలే అవకాశం ఉంది.
Advertisement