ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్

నటుడు మంచు మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు

Advertisement
Update:2024-12-12 15:52 IST

నటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జల్‌పల్లి ఘర్షణలో అస్వస్థతకు గురైన కలెక్షన్ కింగ్ హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, మెడికల్ రిపోర్డులు అన్ని ఆయన నార్మల్‌గా ఉన్నాయని డాక్టర్లులు తెలిపారు. నిన్న ఆయన పోలీసు విచారణకు హాజరు కాకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చెలరేగింది. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆస్తుల విషయంలో జల్లపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు మంచు మనోజ్ వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటి బౌన్సర్లు-విష్ణు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అటు విష్ణు, మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తన ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలతో జర్నలిస్టులపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్ రిపోర్టర్‌పై దాడి చేశారు.

Tags:    
Advertisement

Similar News