Saindhav Movie | సైంధవ్ నుంచి మెలొడీ
Saindhav Movie - విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమా నుంచి తాజాగా మెలొడీ రిలీజైంది.
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం 'సైంధవ్' ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల చేశారు. తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ని లాంచ్ చేశారు.
సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ 'సరదా సరదాగా' పాటని మనసుని హత్తుకునే మెలోడీగా స్వరపరిచారు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సాగే సంభాషణతో పాట ప్రారంభమవుతుంది. ఆమె అతని భార్య కాదు కానీ కుటుంబ సభ్యురాలిగా ఉండాలనుకుంటోంది. సారా పోషించిన వెంకీ కుమార్తె పాత్రతో పాటు ఇద్దరి చూడచక్కని ప్రయాణాన్ని ఆకట్టుకుంది.
జ్వరం ఉన్నప్పుడు పాప వెంకటేష్ ని చూసుకోవడం, తల్లి కాలమ్ లో శ్రద్ధ సంతకం చేయడం, వెంకీ తన కుమార్తెను ఉత్సాహపరిచేందుకు పాఠశాల వార్షిక వేడుకకు హాజరు కావడం లాంటి సన్నివేశాలతో ఈ పాట మనసుని హత్తుకుంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వారి మధ్య బంధాన్ని మరింత అందంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఆ పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. మొదటి పాట మాస్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అయితే, రెండో సింగిల్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతుంది. సంక్రాంతికి వస్తోంది సైంధవ్.