పెళ్లి.. లైఫ్‌లో ఒక పార్ట్‌ మాత్రమే.. గోల్‌ కాదు – క్లారిటీ ఇచ్చేసిన సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌

పెళ్లి విషయమై అడిగిన ప్రశ్నకు వరలక్ష్మి స్పందిస్తూ.. తమ ఇంట్లో ఆ విషయం మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే మానేశారని చెప్పింది. తన దృష్టిలో పెళ్లనేది ముఖ్యం కాదని ఆమె స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-01-14 19:24 IST

తెలుగులో వరుస హిట్‌లతో జోరు మీదున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. సంక్రాంతి బరిలో పందెం కొట్టిన చిత్రాలుగా పేరుపొందిన క్రాక్, వీరసింహారెడ్డి, హను–మాన్‌.. చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. ఆయా చిత్రాల విజయంతో గోల్డెన్‌ లెగ్‌గా కూడా ఇండస్ట్రీలో పేరు పొందింది. వరుసగా మూడేళ్లపాటు వచ్చిన సంక్రాంతి చిత్రాల్లో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాలుగా నిలవడం విశేషం.

తాజాగా వరలక్ష్మి నటించిన ‘హను–మాన్‌’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ నిలిచింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో వరలక్ష్మి అంజమ్మ పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కోట బొమ్మాళి పీఎస్‌’ సినిమా కూడా సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే.

ఈ విధంగా వరుస విజయాలతో జోష్‌ మీదున్న ఈ నటి.. ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు చేరువలో ఉంది. అయినా.. ఇంకా పెళ్లి ఊసెత్తకపోవడంపై తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చేసింది. అది కూడా ఆమెకు లైఫ్‌పై ఉన్న క్లారిటీని తెలియజేసేలా ఉండటం గమనార్హం.

పెళ్లి విషయమై అడిగిన ప్రశ్నకు వరలక్ష్మి స్పందిస్తూ.. తమ ఇంట్లో ఆ విషయం మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే మానేశారని చెప్పింది. తన దృష్టిలో పెళ్లనేది ముఖ్యం కాదని ఆమె స్పష్టం చేసింది. అలాగని తాను వివాహానికి వ్యతిరేకం కాదని తెలిపింది.

పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. పెళ్లనేది లైఫ్‌లో ఒక పార్ట్‌ మాత్రమేనని.. అది గోల్‌ కాదని స్పష్టం చేసింది. అసలు పెళ్లి చేసుకున్నా ఓకే.. చేసుకోకపోయినా ఓకే అని ఆమె తెలిపింది. చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నారు. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ త్రిష కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారని ఆమె తెలిపింది. దీంతో తన జీవితంపై ఆమె ఏ స్థాయిలో క్లారిటీతో ఉందో అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News