Manchu Manoj | మంచు మనోజ్ మాటల్లో పరమార్థం అదేనా!

Manchu Manoj - మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య అభిప్రాయబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడా వివాదాన్ని మరోసారి పరోక్షంగా గుర్తుచేశాడు మనోజ్.

Advertisement
Update:2023-11-25 20:31 IST

మంచు మనోజ్ కు, అతడి సోదరుడు విష్ణుతో వివాదాలున్న సంగతి తెలిసిందే. వీళ్ల కోల్డ్ వార్ ఏంటో అందరికీ తెలుసు. కొన్ని నెలల క్రితం మంచు విష్ణు తనపై బలప్రయోగం చేస్తున్నాడంటూ ఏకంగా వీడియో రిలీజ్ చేశాడు మనోజ్. ఆ తర్వాత మోహన్ బాబు చొరవతో ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఇప్పుడు దీన్ని మరోసారి పరోక్షంగా గుర్తుచేస్తూ.. అన్నదమ్ముల మధ్య అహం, డబ్బు ఉండకూడదంటూ ఓ కార్యక్రమంలో స్పందించాడు మనోజ్.

మంచు సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని ఎప్పటినుంచో పుకార్లు వచ్చాయి. మనోజ్-మౌనికల పెళ్లిలో కూడా విష్ణు కొంచెం ముభావంగా ఉన్నాడు. విష్ణు, మనోజ్ మధ్య మరింత సఖ్యత నెలకొనాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి సెన్సిటివ్ టైమ్ లో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఈవెంట్ లో సోదరభావం గురించి మాట్లాడాడు. అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు రాకూడదని అన్నాడు. దీంతో మంచు మనోజ్ వ్యాఖ్యలు గతాన్ని గుర్తుచేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. మనోజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం సోదరా. ఈ సినిమాలో పాటను మంచు మనోజ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అన్నదమ్ములు ఎలా ఉండాలో కామెంట్ చేశాడు మనోజ్. అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదని, ఆర్థిక సమస్యలు రాకూడదని తెలిపిన మనోజ్.. సమస్య వచ్చినప్పుడు అన్నదమ్ములు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించాడు.

Tags:    
Advertisement

Similar News