శ‌ర్వా లేటెస్ట్ మూవీ మ‌న‌మే ఓటీటీలోకి వ‌చ్చేస్తుందోచ్‌..!

థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి కావ‌డంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. జూలై 12 నుంచి శ‌ర్వా లేటెస్ట్ మూవీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంద‌ని స‌మాచారం.

Advertisement
Update: 2024-07-03 12:06 GMT

ఒకే ఒక జీవితం త‌ర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఛార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్ రీసెంట్ గా మ‌న‌మే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించిన సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్ లో వ‌చ్చిన‌ డీసెంట్ ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామా ఇది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తే.. మాస్టర్ విక్రమ్ ఆదిత్య, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన మ‌న‌మే.. జూన్ 7న గ్రాండ్ రిలీజ్ అయింది. కామెడీ, లవ్, ఎమోషన్, డ్రామా.. ఇలా అన్నిటినీ మేళ‌వించి ఈ సినిమాను రూపొందించారు. మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌న‌మే క‌నెక్ట్ కాక‌పోయినా.. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రం బాగానే మెప్పించింది. మిక్స్డ్ టాక్ రావ‌డం వ‌ల్ల ఆహా ఓహో అన్న రేంజ్‌లో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేదు.

అయితే బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం మ‌న‌మే మూవీ ఫుల్ ర‌న్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. డిస్నీ+ హాట్‌స్టార్ మ‌న‌మే సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి కావ‌డంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. జూలై 12 నుంచి శ‌ర్వా లేటెస్ట్ మూవీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంద‌ని స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News