Keerthy Suresh - హీరోది, నాది ఒకటే డ్రెస్ అంటున్న కీర్తిసురేష్

Keerthy Suresh Nayakudu Movie - నాయకుడు సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు వెల్లడించింది కీర్తి సురేష్.

Advertisement
Update:2023-07-14 22:15 IST

నాయకుడు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది హీరోయిన్ కీర్తిసురేష్. తమిళ్ లో హిట్టయిన మామాన్నన్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. తమిళనాట ఇది సంచలన విజయం సాధించింది. ఈరోజు తెలుగులో కూడా రిలీజైంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది కీర్తిసురేష్. నాయకుడు సినిమా కోసం తనను ఎందుకు తీసుకున్నారు.. ఎలా తీసుకున్నారు.. ఆడిషన్స్ ఎలా జరిగాయి లాంటి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఆడిషన్స్ చేశారనే విషయాన్ని బయటపెట్టింది.

"ఈ చిత్రం కోసం నాకు ముందుగా లుక్ టెస్ట్ చేయలేదు. సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ని అద్భుతంగా రాసుకున్నారు దర్శకుడు మారి. మాములుగా జీన్స్, షర్టు, షూ వేసుకునే ఓ మామూలు అమ్మాయిని. షూటింగ్ కి గంట ముందు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. మీరు గమనిస్తే సినిమాలో ఉదయనిధి ది, నాది ఒకే డ్రెస్ స్టయిల్ ఉంటుంది. ‘నాకు షర్టు లేకపోతే మీ షర్టు వేసుకోవచ్చు కదా' అని ఆయనతో సరదాగా జోకులేసేదాన్ని. ఇంటర్వెల్ టైమ్ లో కొందరు అమ్మాయిలు వచ్చి మీ డ్రెస్సింగ్ బావుందండి అని చెప్పారు. అలా సింపుల్ గా క్యాజువల్ గా ఉండటం వారికి కనెక్ట్ అయ్యింది."

ఇలా నాయకుడు సినిమాలో తన డ్రెస్సింగ్ స్టయిల్, ఆడిషన్స్ గురించి వివరించింది కీర్తిసురేష్. ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరికితే ఎలాంటి పాత్ర పోషించడానికైనా తను సిద్ధమని, తను రీసెంట్ గా చేసిన వెబ్ సిరీస్ చూస్తే ఈ విషయం అర్థమౌతుందని అంటోంది కీర్తిసురేష్.

Tags:    
Advertisement

Similar News