Rashmiks: రష్మికక చర్మ సమస్యలున్నాయా?

Rashmiks - రష్మికపై మరో గాసిప్ పుట్టుకొచ్చింది. ఈసారి ఆమె చర్య సమస్యలతో బాధపడుతోందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి

Advertisement
Update:2023-02-09 09:27 IST

సమంత మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూమ్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రష్మిక కూడా ఓ ఆరోగ్య సమస్యతోనే బాధపడుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

సూర్యరశ్మికి గురికావడం, రసాయనాలు ఎక్కువగా ఉన్న సౌందర్య ఉత్పత్తులు వాడడం, తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలతో చాలామంది హీరోయిన్లున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రష్మిక కూడా చేరిపోయిందంటున్నారు చాలామంది.

తాజాగా ఓ పోస్ట్ పెట్టింది రష్మిక. అందులో ఆమె తన డెయిలీ రొటీన్ ను బయటపెట్టింది. అందులో డెర్మటాలజిస్ట్‌తో అపాయింట్ మెంట్ కూడా ఉంది. దీంతో ఆమె చర్మసంబంధ సమస్యలతో బాధపడుతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

నిజానికి చర్మ సమస్యలు ఉంటేనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాల్సిన పనిలేదు. ఈ కాలం చాలామంది మొటిమలు లేదా విటమిన్ లోపంతో వచ్చే సమస్యల కోసం చర్మవ్యాధి నిపుణుల్ని కలుస్తున్నారు. రష్మిక కూడా అలాంటి రొటీన్ అపాయింట్ మెంట్ కోసం వెళ్లి ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News