మెట్లపై నుంచి జారిపడ్డ హీరో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు

Advertisement
Update:2024-11-08 16:49 IST

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మెట్లపై నుంచి జారిపడ్డాడు. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై మెట్లపై నుంచి వస్తుండగా దేవరకొండ కాలు స్లిప్ అయి కిందపడ్డాడు. ఈ వీడియో రికార్డ్ చేయుద్దని ఆయన టీమ్ చేతులు జోడిస్తూ వేడుకుంది. విజయ్‌కు ఎటువంటి గాయాలూ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు. కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్ లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ రస్టిక్ మూవీలో నటిస్తున్నారు.

Advertisement

Similar News