Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు నుంచి కొత్త పోస్టర్

Hari Hara Veera Mallu - పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2023-09-02 15:17 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హిస్టారికల్ డ్రామా 'హరి హర వీర మల్లు' నుంచి ట్రీట్ వచ్చింది. మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ ఈరోజు విడుదలైంది. పోస్టర్‌లో గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎరుపు సాంప్రదాయ దుస్తులు, నలుపు పైజామా ధరించి ఉన్నాడు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న శత్రువులు నేల మీద పడి ఉండటం, మట్టి దుమ్ము లేవడం మనం గమనించవచ్చు. ఈ చిత్రానికి 'ది లెజెండరీ హీరోయిక్ అవుట్‌-లా' అని ఉప శీర్షికను జోడించి, 'హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ' అని చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.

ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీరమల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ. 

Tags:    
Advertisement

Similar News