Dil Raju - ఆంధ్రాలో 'బలగం' ఆడదన్నారు
Dil Raju Balagam Movie - బలగం మూవీ సక్సెస్ అయిందంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఆంధ్రాలో ఈ సినిమా ఆడదని అనుకున్నానని, కానీ బాగా నడుస్తోందని అన్నారు
పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా బలగం. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా ఆంధ్రాలో ఆడదని చాలామంది అనుకున్నారు. విడుదలకు ముందు ఆ అనుమానాలు తనకు కూడా ఉన్నాయని, అందుకే ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లకు ముందే సినిమా చూపించానని అన్నారు దిల్ రాజు.
"తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా కావటంతో అది ఆంధ్ర ప్రజలకు కనెక్ట్ అవుతుందా కాదా అని ఆలోచించాను. నా సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌కి, డైరెక్టర్స్‌కి చూపించాను. నా డౌట్‌ను వాళ్లకి వక్తం చేశాను. వాళ్లు చెప్పింది ఒకటే. సినిమా తెలంగాణనా, ఆంధ్రానా అని కాదు సార్.. బలమైన ఎమోషన్స్ ఉన్నాయన్నారు. అదే కనెక్ట్ అవుతుందని అన్నారు. రిలీజ్ తర్వాత సినిమా చూసిన వారందరూ అదే చెబుతున్నారు."
ఇలా ఏపీలో కూడా తన సినిమా ఆడుతోందంటున్నారు దిల్ రాజు. చిన్న సినిమాపై చిన్నచూపు ఉండకూడదంటున్న దిల్ రాజు, ఇలాంటి సినిమాలు కూడా థియేటర్లలోకి రావాలంటున్నారు.
"చిన్న సినిమా అంటే ప్రేక్షకుడితో సహా అందరికీ చిన్న చూపు. చాలా అద్భుతమైన సినిమాగా ఉంటే తప్ప ఆడియెన్స్ థియేటర్స్‌కు రారు. అలాంటి బ్యూటీఫుల్ కాన్సెప్ట్ మూవీనే బలగం. ఆ కథ వినగానే నచ్చేసింది. బలగం సినిమాను చాలా ప్రేమతో చేశాను. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఓటీటీకి ఇచ్చేద్దామని అన్నారు కూడా. ఇలాంటి సినిమాను థియేటర్‌కు తీసుకెళ్లటానికి నేను రంగంలోకి దిగాను. అందు కోసమే ముందుగానే షోస్ వేశాను. ఈ సినిమాలో మంచి ఎమోషన్స్‌తో పాటు మెసేజ్ ఉంది. కాబట్టి దాన్ని ఎంత మంది చూస్తే అంత మంచిదని నేను ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లాను."
బలగం సినిమాకు నాన్-థియేట్రికల్ రూపంలో మంచి ఎమౌంట్ వచ్చిందంట. దీంతో థియేట్రికల్ రిజల్ట్ పై తనకు ఎలాంటి బెంగ లేదని చెప్పుకొచ్చారు దిల్ రాజు.