ధైర్యమే కవచం, ఆశనే అతని ఆయుధం

కొత్త సినిమాను ప్రకటించిన సాయి దుర్గాతేజ్‌

Advertisement
Update:2024-10-15 12:05 IST

 వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలలో సాయి దుర్గా తేజ్‌ ఒకరు. విరూపాక్ష, బ్రో వంటి హిట్‌ మూవీస్‌ తర్వాత మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. నేడు ఆ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. #SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనున్నది.

ఈ విషయాన్ని చెబుతూ.. మూవీ టీం ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. 'హనుమాన్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించిన కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. 'ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడుతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే' అనే క్యాప్షన్‌ తో ఓ వీడియోను విడుదల చేస్తూ చిత్రబృందం సాయి దుర్గా తేజ్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పింది.

Full View

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ