NBK109 | బాలయ్య సినిమా షెడ్యూల్ పూర్తి

NBK109 - బాలకృష్ణ, బాబి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతోంది. తాజాగా భారీ షెడ్యూల్ పూర్తయింది.

Advertisement
Update:2024-08-12 22:36 IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన భారీ షెడ్యూల్ రాజస్థాన్‌లో ముగిసింది. యూనిట్ మొత్తం హైదరాబాద్‌ తిరిగి వచ్చింది.

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో బాలకృష్ణతో దిగిన సెల్ఫీ ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రాజస్థాన్ షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు బాబీ ప్రకటించాడు.

వర్షం కారణంగా షూటింగ్‌కు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. కానీ టీమ్ అనుకున్న సన్నివేశాలను పూర్తి చేయగలిగింది. ఈ షెడ్యూల్‌లో నందమూరి బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.

చిత్రంలో ముగ్గురు హీరోయిన్లున్నారు. ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. త్వరలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు బాబీ తెలిపాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News