హీరోగా మారిన మరో జబర్దస్త్ నటుడు

జబర్దస్త్ లో నవ్వులు పూయించిన ఆటో రామ్ ప్రసాద్, వెండితెరపైకొచ్చాడు. హీరోగా మారిన ఓ సినిమా చేశాడు.

Advertisement
Update: 2022-07-17 07:36 GMT

జబర్దస్త్ లో కామెడీ పండించిన కమెడియన్లు నటులుగా మారడం కొత్తేంకాదు. యాంకర్ రష్మి నుంచి సుడిగాడి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, అదిరే అభి.. ఇలా చాలామంది సినిమాల్లోకి వెళ్లారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో కమెడియన్ వచ్చి చేరాడు.

సుప్రీమ్ డ్రీమ్స్ బ్యానర్ పై క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు!!

జబర్దస్త్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న "పీప్ షో" చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా యూనిట్ కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేసింది.

శ్రీరాగ్, సంధ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.


Full View


Tags:    
Advertisement

Similar News