ఆస్కార్ లో 'నాటు నాటు' పాట గట్టి పోటీ ఇస్తోంది... అమెరికన్ పత్రిక‌ వెల్లడి

RRR మూవీలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో గట్టి పోటీ ఇస్తోందని వెరైటీ అనే అమెరికన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక‌ ప్రకారం మెల్ బ్రూక్స్, బిల్లీ ఎలిష్, లేడీ గాగా, సెలీనా గోమెజ్, జాజ్మిన్ సుల్లివన్, డయాన్ వారెన్ పాటలతో 'నాటు నాటు' పాట పోటీ పడుతోంది.

Advertisement
Update:2022-10-11 13:47 IST

SS రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన 'RRR' మూవీలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గట్టి పోటీ ఇస్తున్నదని 'వెరైటీ' అనే అమెరికన్ పత్రిక‌ పేర్కొంది. పోటీలో ఉన్న మొదటి ఐదు పాటల్లో 'నాటు నాటు' ఒకటి అని ఆ పత్రిక‌ పేర్కొంది. అయితే ఇది భారత దేశం నుండి వెళ్ళిన అధికారిక పాట కాదు.

కాలిఫోర్నియా పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల అసెంబ్లీలో ఈ పాట పాడటం నుండి థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు అభిమానులు ఆకస్మిక నృత్యాలు చేయడం వరకు ఈ మూవీ విడుదలైనప్పటి నుండి 'నాటు నాటు' పాట ప్రజ‌ల హృదయాలను గెలుచుకున్న మాస్ గీతం అని వెరైటీ పత్రిక వ్యాఖ్యానించింది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.

అమెరికన్ పత్రిక 'వెరైటీ' , 'అస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు పాట ఉండటం ఒక అవసరం' అనే హెడ్డింగ్ తో కథనాన్ని ప్రచురించింది.

ఆ పత్రిక‌ ప్రకారం మెల్ బ్రూక్స్, బిల్లీ ఎలిష్, లేడీ గాగా, సెలీనా గోమెజ్, జాజ్మిన్ సుల్లివన్, డయాన్ వారెన్ పాటలతో 'నాటు నాటు' పాట పోటీ పడుతోంది.

Tags:    
Advertisement

Similar News