Buddy Movie | మళ్లీ తెరపైకి అల్లు శిరీష్

Allu Sirish's Buddy Movie - లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా రెడీ చేశాడు అల్లు శిరీష్. బడ్డీ మూవీ ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update: 2024-06-25 16:18 GMT

అల్లు శిరీష్ తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ హీరో. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు, సామ్ అంటోన్ దర్శకుడు.

"బడ్డీ" సినిమా ట్రయిలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకుముందు టెడ్డీ బేర్ తో ఓ సినిమా వచ్చినప్పటికీ, దానికి, దీనికి చాలా తేడా కనిపిస్తోంది. ఇది మాట్లాడే టెడ్డీ. యాక్షన్ కూడా చేస్తుంది.

అల్లు శిరీష్, కెప్టెన్ ఆదిత్య రామ్‌గా పైలట్‌గా కనిపించాడు. ఇక హీరోయిన్ ను ఎయిర్ కంట్రోల్ రూమ్ లో అమ్మాయిగా చూపించారు. వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ చూపించారు. ఆ వెంటనే ట్రైలర్ యాక్షన్ మోడ్‌లోకి మారుతుంది. ఆడియన్స్ కు కావాల్సినంత యాక్షన్ అందించబోతోంది ఈ సినిమా. ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

ట్రయిలర్ లో అల్లు శిరీష్, బడ్డీల యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. కామెడీ కోసం మాత్రమే కాకుండా, ఓ కీలక పాత్ర కోసం అలీని తీసుకున్నట్టున్నారు. ఇక మరో కీలక పాత్రలో అజ్మల్ ఎప్పట్లానే బాగా సెట్ అయ్యాడు. జులై 26న సినిమా విడుదలవుతోంది బడ్డీ.

Full View

Tags:    
Advertisement

Similar News