Allu Arjun: కేరళ అమ్మాయిని దత్తత తీసుకున్న అల్లు అర్జున్..
Allu Arjun: తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అమ్మాయి నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న కలెక్టర్ ఒక ఏడాది ఫీజు చెల్లించాలని అల్లు అర్జున్ ని కోరారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మొత్తం నాలుగేళ్లు తానే ఫీజు చెల్లిస్తానన్నారు.
అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనకు అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కి చాలామంది అభిమానులున్నారు. కేరళ ప్రజలన్నా ఐకాన్ స్టార్ కి అంతే అభిమానం. ఆ అభిమానంతోనే ఓ కేరళ అమ్మాయిని దత్తత తీసుకున్నారు అల్లు అర్జున్. ఆమె చదువు పూర్తయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చుని తానే భరిస్తానని చెప్పారు.
కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకోసం అలెప్పి కలెక్టర్ కృష్ణతేజ వుయ్ ఆర్ ఫర్ అలెప్పి అనే కార్యక్రమం ప్రారంభించారు. అందులో అల్లు అర్జున్ భాగస్వామ్యం కూడా ఉంది. తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అమ్మాయి నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకున్న కలెక్టర్ ఒక ఏడాది ఫీజు చెల్లించాలని అల్లు అర్జున్ ని కోరారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మొత్తం నాలుగేళ్లు తానే ఫీజు చెల్లిస్తానన్నారు. ఆమెను తాను దత్తత తీసుకుంటాని తెలిపారు.
అలెప్పి కలెక్టర్ అభినందనలు..
తాను కోరిన వెంటనే నర్సింగ్ విద్యార్థి చదువు బాధ్యతలు తీసుకున్న అల్లు అర్జున్ కి అలెప్పి జిల్లా కలెక్టర్ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు. ఆ అమ్మాయి చదువుల్లో ఫస్ట్ అని, కానీ కరోనా వల్ల తండ్రిని కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని, ఇలాంటి సమయంలో ఆమెకు అల్లు అర్జున్ అండగా నిలవడం నిజంగా గొప్ప విషయం అని అన్నారు కలెక్టర్ కృష్ణతేజ. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ కేరళ అభిమానులు ఆయనపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.