Selfiee - ఓటీటీలోకి అక్షయ్ కుమార్ డిజాస్టర్ సినిమా
Akshay Kumar's Selfiee - థియేటర్లలో డిజాస్టర్ అయిన సెల్ఫీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరో.
అక్షయ్ కుమార్ తాజా చిత్రం సెల్ఫీ. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా హిందీలో తెరకెక్కింది ఈ మూవీ. అయితే బాలీవుడ్ లో ఈ సినిమా డిజాస్టర్ అయింది. కనీసం అక్షయ్ కుమార్ కోసం కూడా ఈ సినిమా చూడ్డానికి ఎవ్వరూ మొగ్గుచూపలేదు. ఫలితంగా రిలీజైన రెండో రోజుకే ఈ మూవీ దుకాణం సర్దేసింది.
అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ తీస్తే, టాప్-3లో నిలుస్తుంది సెల్ఫీ సినిమా. దీన్ని బట్టి ఈ సినిమా రిజల్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం వహించాడు. డయానా పెంటీ, నౌషరత్ బరూచా హీరోయిన్లుగా నటించారు.
థియేటర్లలో డబుల్ డిజాస్టర్ అనిపించుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈనెలాఖరుకు డిస్నీహాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
థియేటర్లలో ఈ సినిమాను ఎవ్వరూ చూడలేదు. కాబట్టి ఓటీటీలో దీనికి ఆదరణ ఉండొచ్చని సదరు స్ట్రీమింగ్ సంస్థ భావిస్తోంది. కానీ థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను ఓటీటీలో చూడ్డానికి కూడా ఆడియన్స్ ఇష్టపడడం లేదు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది సెల్ఫీ సినిమా.