అమెరికా ఎన్నికల ఫలితాలు.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు
ట్రంప్ గెలుపు అవకాశాలతో స్టాక్‌మార్కెట్లో జోష్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా వెళ్తుండంతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొన్నది. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా 80,200 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభాల్లో 24,450 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.23 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.81 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,744.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెన్నాలజీస్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.