Royal Enfield Meteor 350 Aurora | రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బుల్లెట్ `మీట‌ర్ 350 అరోరా`ఎడిష‌న్‌.. ధ‌రెంతంటే..?!

Royal Enfield Meteor 350 Aurora | ప్ర‌ముఖ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న మీట‌ర్ 350 (Meteor 350 ) బైక్‌ల‌ను విస్త‌రిస్తోంది.

Advertisement
Update:2023-10-14 11:18 IST

Royal Enfield Meteor 350 Aurora | రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బుల్లెట్ `మీట‌ర్ 350 అరోరా`ఎడిష‌న్‌.. ధ‌రెంతంటే..?!

Royal Enfield Meteor 350 Aurora | ప్ర‌ముఖ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న మీట‌ర్ 350 (Meteor 350 ) బైక్‌ల‌ను విస్త‌రిస్తోంది. కొత్త‌గా అరోరా (Aurora) వేరియంట్ మోటారు సైకిల్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. దీని ధర రూ.2.20 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌)గా నిర్ణ‌యించారు. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇత‌ర బైక్‌ల నుంచి కొన్ని ఫీచ‌ర్లతో మీట‌ర్ 350 అరోరా బైక్ అప్‌డేట్ చేశారు.


స్టెల్లార్ (Stellar), సూప‌ర్ నోవా (Supernova) బైక్‌ల‌లోని కొన్ని ఫీచ‌ర్లు జ‌త చేశారు. సూప‌ర్ నోవా టాప్ ట్రిమ్‌ (Supernova) లోని న్యూ ఎల్ఈడీ హెడ్‌లైట్, స్పోక్ వీల్స్‌ వంటి ఫీచ‌ర్లు మిన‌హా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మీట‌ర్ 350 అరోరా ఎడిష‌న్ దాదాపు మిగ‌తా బైక్‌ల మాదిరిగానే ఉంటుంది. అరోరా గ్రీన్‌, అరోరా బ్లూ, అరోరా బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తాయి. రెట్రో స్టయిల్ ట్యూబ్ టైర్లు, ఇంజిన్‌తోపాటు క్రోమ్ ఫినిష్, ఎగ్జాస్ట్‌ సిస్ట‌మ్‌, కంపోనెంట్స్‌, అల్యూమినియం స్విచ్ క్యూబ్‌లు ఉంటాయి.



సింగిల్ సిలిండ‌ర్‌, ఎయిర్ కూల్డ్ 349సీసీ ఇంజిన్‌తో ప‌ని చేస్తుందీ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మీట‌ర్ 350 ఎడిష‌న్ బైక్‌. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 20.2 బీహెచ్‌పీ విద్యుత్‌, 27 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ప‌ని చేస్తుంది. రైడ‌ర్లు సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణం చేయ‌డానికి వీలుగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ యాప్ సాయంతో ఫోన్‌ను క‌నెక్ట్ చేసి బైక్‌ను నియంత్రించ‌వ‌చ్చు. బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌తో ఫోన్‌కు నేవిగేష‌న్ సిస్ట‌మ్ క‌నెక్ట్ అవుతుంది.డిజిట‌ల్ అన‌లాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఓడో మీట‌ర్‌, ఫ్యుయ‌ల్ గేజ్‌, ట్రిప్ మీట‌ర్‌, స‌ర్వీస్ రిమైండ‌ర్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యుయ‌ల్ చానెల్ ఏబీఎస్‌, ట్విన్ షాక్ అబ్జార్బ‌ర్స్‌, ఎల్ఈడీ డీఆర్ఎల్‌తోపాటు స‌ర్క్యుల‌ర్ హ‌లోజ‌న్ హెడ్ ల్యాంప్స్‌, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్ వంటి ఫీచ‌ర్లు జ‌త చేశారు. ఇద్ద‌రు ప్ర‌యాణికులు కూర్చునేందుకు బుల్లెట్ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. బ్యాక్ రెస్ట్ కూడా ఉంట‌ది.

మీట‌ర్ 350 అరోరా ఎడిష‌న్‌తోపాటు ఫైర్‌బాల్‌, స్టెల్లార్‌, సూప‌ర్ నోవా వేరియంట్ల‌లో కొన్ని మార్పుల‌తో మార్కెట్‌లో ఆవిష్క‌రించింది రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌. సూప‌ర్ నోవా టాప్ హై ఎండ్ బుల్లెట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌, అల్యూమినియం స్విచ్ క్యూబ్స్, స్టెల్లార్ బైక్‌లో స్టాండ‌ర్డ్‌గా ట్రిప్ప‌ర్ నేవిగేష‌న్ డివైజ్ అమ‌ర్చారు.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మీట‌ర్ 350 అరోరా వేరియంట్ రూ.2.20 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. మ‌రోవైపు ఫైర్‌బాల్ రూ.2.06 ల‌క్ష‌లు, స్టెల్లార్ రూ.2.16 ల‌క్ష‌లు, టాప్ హై ఎండ్ సూప‌ర్ నోవా రూ.2.30 ల‌క్ష‌లు (అన్ని ధ‌ర‌లూ ఎక్స్ షోరూమ్‌) పలుకుతాయి.

Tags:    
Advertisement

Similar News