Royal Enfield Bullet 350 | వ‌స్తోంది..రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Royal Enfield Bullet 350 | దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లంటే కుర్రాళ్ల‌కు ఎంతో క్రేజీ. దానిపై వెళుతుంటే ఆ ద‌ర్జాయే వేరు.. అంత‌టి క్రేజ్ ఉన్న రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. టెక్నాల‌జీతో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా ఫీచ‌ర్ల‌లో స‌రికొత్త మార్పులు తెచ్చి అప్‌డేటెడ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ సిద్ధం చేసింది.

Advertisement
Update:2023-08-31 15:25 IST

Royal Enfield Bullet 350 | దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లంటే కుర్రాళ్ల‌కు ఎంతో క్రేజీ. దానిపై వెళుతుంటే ఆ ద‌ర్జాయే వేరు.. అంత‌టి క్రేజ్ ఉన్న రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. టెక్నాల‌జీతో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా ఫీచ‌ర్ల‌లో స‌రికొత్త మార్పులు తెచ్చి అప్‌డేటెడ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ సిద్ధం చేసింది. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ యూసీఈ బుల్లెట్ స్థానే అప్‌డేటెడ్ బుల్లెట్ 350 వ‌స్తున్న‌ది.

జే-సిరీస్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌దీ బైక్‌. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ) నాడు భార‌త్ మార్కెట్లో త‌న బుల్లెట్‌350 బైక్ ఆవిష్క‌రించ‌నున్న‌ది. దీని ధ‌ర రూ.2 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభం కావ‌చ్చు. మార్కెట్లో ఆవిష్క‌రించ‌గానే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ ప్రీ-బుకింగ్స్‌.. కొన‌సాగింపుగా డెలివ‌రీలు ప్రారంభం అవుతాయి. బుల్లెట్‌-350 బైక్‌.. టీవీఎస్ రోనిన్ (TVS Ronin), హోండా సీబీ 350 (Honda CB 350), జావా 42 (Jawa 42), యెజ్డీ రోడ్‌స్ట‌ర్ (Yezdi Roadster)ల‌తో పోటీ ప‌డుతుంది.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ హంట‌ర్ 350 (Royal Enfield Hunter 350) ధ‌ర రూ.1.50 ల‌క్ష‌ల నుంచి 1.75 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతుండ‌గా, రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) మోటారు సైకిల్ ధ‌ర రూ.1.93 ల‌క్ష‌ల నుంచి రూ.2.25 ల‌క్ష‌ల మ‌ధ్య ప‌లుకుతున్న‌ది. న్యూ జ‌న‌రేష‌న్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) మోటారు సైకిల్ ధ‌ర రూ.1.50 ల‌క్ష‌ల నుంచి రూ.2.50 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంద‌ని భావిస్తున్నారు. మార్కెట్లో ఆవిష్క‌రించిన త‌ర్వాత రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్ల‌లో బుల్లెట్ 350 అత్యంత చౌక మోటారు సైకిల్ కానున్న‌ది.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండ‌ర్‌, ఎయిర్ ఆయిల్ కూల్డ్‌, ఫ్యుయ‌ల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వ‌స్తున్న‌ది. ఈ ఇంజిన్ 6100 ఆర్పీఎం వ‌ద్ద గ‌రిష్టంగా 20.2 బీహెచ్‌పీ విద్యుత్‌, 4000 ఆర్పీఎం వ‌ద్ద 27 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. బుల్లెట్ 350 బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వ‌స్తున్న‌ది. సింగిల్ పీస్ సీట్‌, స్పోక్ రిమ్స్‌, డిఫ‌రెంట్ టెయిల్ లాంప్‌, బాడీ గ్రాఫిక్స్‌తోపాటు పాత‌త‌రం బైక్‌తో పోలిస్తే బుల్లెట్‌350 పూర్తిగా అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్‌. బైక్ ఇంజిన్ ఫ్యుయ‌ల్‌ ట్యాంక్‌పై 3డీలో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ లోగో డిస్‌ప్లే చేస్తారు.

ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్ విత్ అన‌లాగ్ స్పీడో మీట‌ర్‌, స్మాల్ డిజిట‌ల్ రీడ్ఔట్ ఫ‌ర్ ఫ్యుయ‌ల్ గేజ్‌, టెలిస్కోఫిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయ‌ల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బ‌ర్స్ @ రేర్ ల‌భిస్తాయి. ఫ్రంట్‌లో డిస్క్‌బ్రేక్‌, రేర్‌లో సింగిల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు డ్ర‌మ్ యూనిట్ సాయంతో బ్రేక్‌లు హ్యాండిల్ చేస్తారు. బుల్లెట్ 500, బుల్లెట్ ఎలెక్ట్రా, బుల్లెట్ సిక్స్‌టీ5 మోటారు సైకిళ్లపై కూడా చ‌ర్చ సాగుతున్న‌ది.

2020లో కేంద్ర ప్ర‌భుత్వం క‌ర్బ‌న ఉద్గారాల‌ను నియంత్రించ‌డానికి బుల్లెట్ 500 బైక్‌ను దేశీయ మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించినా.. గ్లోబ‌ల్ మార్కెట్లో విక్ర‌యిస్తూనే ఉంది. 2000వ ద‌శ‌కంలో బుల్లెట్ సిక్స్‌టీ 5 ఆవిష్క‌రించారు. బుల్లెట్ 500, బుల్లెట్ ఎలెక్ట్రా, బుల్లెట్ సిక్స్‌టీ మోటారు సైకిళ్ల‌ను కూడా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్.. జే-సిరీస్ ఇంజిన్ల‌తో మార్కెట్లోకి తీసుకొస్తుంద‌ని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News