Kinetic E-Luna | భారత్ మార్కెట్లోకి కెనెటిక్ ఈ-లూనా.. ధరెంతంటే..?!
Kinetic E-Luna | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కెనెటిక్ అనుబంధ కెనెటిక్ గ్రీన్ (Kinetic Green) దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ అవతార్ `లూనా (E-Luna)`ను ఆవిష్కరించింది.
Kinetic E-Luna | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కెనెటిక్ అనుబంధ కెనెటిక్ గ్రీన్ (Kinetic Green) దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ అవతార్ `లూనా (E-Luna)`ను ఆవిష్కరించింది. దీని ధర రూ.69,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. గత నెల 26 నుంచే బుకింగ్స్ నమోదయ్యాయి. ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా దీని గురించి ఎంక్వయిరీ చేశారు. పట్టణ, గ్రామీణ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో లక్ష ఈ-లూనా (E-Luna) లు విక్రయించాలని కెనెటిక్ గ్రీన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ ఈ-లూనాకు నెలకు రూ.2,500 లోపు ఖర్చు మాత్రమే వస్తుందని ప్రకటించింది. భారత్‌లోనే ఈ-లూనా (E-Luna)ను డిజైన్ చేశామని తెలిపింది. దీని పేలోడ్ కెపాసిటీ 150 కిలోలు.
ఈ-లూనా 2.2 కిలోవాట్ల బీఎల్‌డీసీ మిడ్ మౌంట్ మోటార్ విత్ ఐపీ-67 రేటెడ్ రెండు కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీ, స్వాప్పబుల్ బ్యాటరీ ఆప్షన్లలో కెనెటిక్ ఈ-లూనా (E-Luna) పని చేస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 110 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా 50 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. నాలుగు గంటల్లో ఈ-లూనా బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. భవిష్యత్‌లో 1.7 కిలోవాట్లు, 3.0 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కూడిన ఈ-లూనాను తీసుకొస్తామని ప్రకటించింది.
డ్యుయల్ ట్యూబులర్, హై స్ట్రెంత్ స్టీల్ చేసిస్ ఆధారంగా కెనెటిక్ గ్రీన్ ఈ-లూనా (E-Luna) ఉంటుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ పోర్క్‌లు, 16 అంగుళాల వీల్స్ కలిగి ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటది. ఈ-లూనా (E-Luna) ఐదు కలర్ ఆప్షన్లు - మల్బరీ రెడ్, పెరల్ ఎల్లో, నైట్ స్టార్ బ్లాక్, ఓషియన్ బ్లూ, స్పార్క్‌లింగ్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ-లూనాల డెలివరీలు ప్రారంభం అవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికలపైనా ఈ లూనాలు విక్రయిస్తారు.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తోపాటు సీఏఎన్ ఎనేబుల్డ్ కమ్యూనికేషన్స్ ప్రొటోకాల్ కలిగి ఉంటుంది. యూఎస్బీ-చార్జింగ్ పోర్టు, త్రీ రైడింగ్ మోడ్స్, డిటాచబుల్ రేర్ సీట్, సైడ్ స్టాండ్ సెన్సర్ ఉంటాయి. కెనెటిక్ గ్రూప్ చైర్మన్ అరుణ్ ఫిరోడియా మాట్లాడుతూ.. ఈ-లూనా అభివృద్ధికి కెనెటిక్ గ్రూప్ పూర్తిగా మద్దతుగా నిలిచినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఈ-లూనా 100 శాతం భారత్ కోసం డిజైన్ చేసిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయినందుకు నేను గర్విస్తున్నా అని అన్నారు.
ఈ-లూనా ట్రేడ్‌మార్క్ చేసిస్, ట్రాన్స్‌మిషన్, స్మార్ట్ కంట్రోలర్, డిజిటల్ క్లస్టర్, మోటారు వంటి విడి భాగాల రూపకల్పనలో కెనెటిక్ ఇంజినీరింగ్, కెనెటిక్ కమ్యూనికేషన్స్, కెనెటిక్ ఎలక్ట్రిక్ మోటార్ కంపెనీ వంటి పలు గ్రూపులు కీలకంగా వ్యవహరించాయి అని అరుణ్ ఫిరోడియా తెలిపారు. పర్సనల్, కమర్షియల్ అవసరాల కోసం ఈ-లూనా డిజైన్ చేసినట్లు కెనెటిక్ గ్రీన్ ఫౌండర్ కం సీఈఓ సులజా ఫిరోదియా మోత్వానీ గుర్తు చేశారు.