పసిడి పరుగులు పెడుతోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. గురువారం ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.78 వేల మార్క్ దాటేసింది. ఇంటర్నేషన్ మార్కెట్‌లోనూ బంగారానికి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లపైనా ఆ ప్రభావం కనబడుతోంది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.77,850 పలుకగా, గురువారం రూ.400 పెరిగి రూ.78,250గా ఉంది. వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. కిలో వెండి ధర రూ.94 వేలు పలికింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్ గా భావిస్తున్నారని, ఈక్రమంలోనే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ ఎనలిస్టులు చెప్తున్నారు.
Advertisement