మారెళ్ల కేశవరావు (జూలై 3 1924 - జూన్ 23 1983 ) వాయులీన విద్వాంసులు. ఆకాశవాణిలో వారివాయులీన సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వాయులీన విధ్వాంసులలో ఒకరు
జీవిత విశేషాలు
ఆయన ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో జన్మించారు. పుట్టుకతోనే అంధులైన అతను విజయనగరం చేరారు. అక్కడ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలోపనిచేస్తున్నద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి వాయులీనంలో ప్రావీణ్యత సంపాదించాడు.
ఆయన మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించే వార్షిక కచేరీలలో పాల్గొన్నారు. వారి కచేరీ కార్యక్రమాలు 1946 డిసెంబరు 31, 1949 జనవరి 1న జరిగాయి. ఆయన 1961 నవంబరు 5 న మద్రాసులో జరిగిన రేడియో సంగీత సమ్మేళనం కార్యక్రమంలో కర్ణాటక సంగీత విభాగంలో పాల్గొన్నారు
అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా సేవలందించి పదవీ విరమణ చేసారు
1983 జూన్ 23 న స్వర్గస్తులయ్యారు