నా జీవితంలో రోజూ
వసంతోత్సవమే,
ఉదయం సూర్యుడిలో
కాషాయ రంగు చూశాను,
మధ్యాహ్న సూర్యుడు లో
వెండి రంగు చూశాను
సంధ్య సూర్యుడిలో
పసుపు, కాషాయాల
కలగలుపు చూసాను
పూర్ణచంద్రుడిలో
హిరణ్య వర్ణం చూశాను,
కొండలలో కోనలలో
బూడిద రంగు చూశాను,
సాగరాలలో
నీలి, ఆకుపచ్చలను దర్శించాను
నీటిలో వర్ణ హీనం కనబడింది,
మట్టిలో అనేక రంగులు
చూపున నిలిచాయి,
అగ్ని శిఖలలో
ఎరుపు,కాషాయ, నీలిరంగుల సమ్మేళనం చూశాను.
అంత దాకా ఎందుకు
నా శరీరంలోనే ఉన్నాయి
అన్ని రంగులు రక్త,మాంస,మజ్జరూపాలలో.
నా జీవితమే
రంగుల కలయికతో కూడిన
వసంత కేళి.
- వాడ్రేవు కామేశ్వరి
Advertisement