జన్మనిచ్చేవాడు తండ్రి .
జన్మే లేకుండా చేసేవాడు - సద్గురువు
ఇక్కడ నుండి అక్కడకు వెళ్లాలి అని అనుకోవడం -- సాధన.
అక్కడ నుండే ఇక్కడకు వచ్చాము అని తెలుసుకోవడం -- జ్ఞానము.
అన్నింటికీ సిద్ధపడి ఉండడమే "సిద్ధి".
దేహం తో ఉండు.
దేహం గా ఉండొద్దు
ఊరక ఉండడం మాయకు తెలియదు.
కదలడం పరబ్రహ్మానికి తెలియదు.
ఈ రెంటి స్పర్శతో పుట్టినవాడే జీవుడు.
అందువల్లనే జీవుడు బంధ, మోక్షములకు మధ్య ఊగిసలాడు
తుంటాడు.
♀️♀️♀️
శిష్యుడు - మీరు గొప్ప మహనీయులు అండి.
గురువు - అని మీరు గుర్తించగలిగారు అంటే, మీరు నా కన్నా గొప్ప మహనీయులు.
రూపాంతరం చెందే తనువు (జగత్తు) -- తమోగుణం.
నిర్వికారం, సత్య వస్తువు అయిన హృదయము (ఆత్మ) -- సత్వగుణము.
ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనస్సు (మాయ) -- రజోగుణం.
ఈ త్రిగుణములు ప్రకటనంగా ఉంటే తాను 'జీవుడు'.
తెలిసితే మోక్షము ...
తెలియకుంటే బంధము ...
"కల అంటే నిద్ర లో వచ్చేది కాదు, నిద్రపోనివ్వకుండా చేసేది !"
పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం !
ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం...
రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో ..నీ ఫొటో పెట్టే ఆసక్తి లేనప్పుడు...
నీ మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు... సంపాదన మానేయడం కాదు. ధనమే కాక సమయం వెచ్చించి సంస్కారం కూడా సంపాదించడం ముఖ్యం
"ఎదుటోడి తప్పును గుర్తించేవాడు మేధావి. తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని.
మనచుట్టు"మేధావులకు కొదవలేదు.. జ్ఞానులకు ఉనికి లేదు !"
జీవిత లక్ష్యం రెండుపూటలా తిని నాలుగు రాళ్లు సంపాదించడం మాత్రమే కాదు .. అసలు ఆ భగవంతుడు మనకి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవడం
సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు... ఏదో రెండు మంచి మాటలు చదివి జ్ఞానం వస్తుందనుకుంటే పొరపాటు .. రోజు కాస్త సమయం ప్రవచనాలను పురాణాలను వింటూ గడపాలి.
లక్ష్యం పట్ల ఏకాగ్రత పెరగాలంటే ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి.
నిజం నిలకడగా నివాసం ఉండాల్సింది మనిషి హృదయంలో.. పైపై పెదవులపై కాదు !
మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు... నాణ్యమైన మట్టి !