జ్ఞాపకం

Advertisement
Update:2023-03-07 13:22 IST

మా బాల్యకాలపు మరువలేని జ్ఞాపకాల్లో హోళీ పండుగస్థానం మరీ ప్రత్యేకం

పండుగ ముందు రోజే మిత్రులమంతా బీళ్ళల్లోకో గుట్టలమీదికో వెళ్ళి మూటలు మూటలు మోదుగుపూలు కోసుకొచ్చి రాత్రికి రాత్రే పాత బానల్నిండ నీళ్ళునింపి వాటిల్లో పూలుపోసి కట్టెల పొయిలమీద మసలబెట్టి రంగు దింపేది.

ఆ రంగును చిమ్మన గొట్టాల్లో నింపుకుని వరసైన వారిమీద చిమ్ముకుంటూ ఆనందంతో చిందులేసేది.

మరిప్పుడో!? ప్రకృతితో సంబంధాలు తెంపుకుని

కొట్ల మీదపడి రసాయనాల రంగుల్ని, కోడిగుడ్లను,సిల్వర్ పెయింట్లను కొని రుద్దుకుంటూ మత్తులో శుద్ధి బుద్దులను కోల్పోయి పండగ జరుపుకుంటున్నారు

మనమంతా తిరిగి ప్రకృతితో మమేకమవ్వాలని కోరుకుంటూ

మీకు వర్ణశోభిత శుభాకాంక్షలు

- శిరంశెట్టి కాంతారావు

Tags:    
Advertisement

Similar News