డే లైట్ సేవింగ్ ...నేడే కాలం మారింది

USA లో డేలైట్ సేవింగ్ వల్ల టైమ్ మారినందుకు వ్రాసిన కవిత

Advertisement
Update:2023-03-13 09:17 IST

కాలాన్ని మనం మార్చ గలమా ?

మానవమాతృడెవడైనా చేతులెత్తేయాల్సిందే

కాల గమనం లో

మనిషి లో ఎన్ని మార్పులు

గడిచిన కాలాన్ని వెనక్కి తిప్పలేం

కెన్ వియ్ పుట్ ద క్లాక్ బ్యాక్ ?

నో ... అది భగవంతుడి వల్ల కూడా కాదు

కాలుడు కాలాన్ని గమనించి

మనిషి చేత ధర్మం చేయిస్తాడు

అది కాలధర్మం

అందరికీ తెలిసీ తెలియనట్టుందే

భగవన్మర్మం

కానీ ఆ కీలు తిప్పో

ఈ బటన్లు నొక్కో

గంటలూ నిముషాలూ

ముందుకీ వెనక్కీ నడిపేయొచ్చు

కాలాన్ని నిర్దేశిస్తున్నామని

నిర్మొహమాటంగా కాలరెగరెయ్యొచ్చు

కానీ కాలం కలకాలం

అలానే ఉంటుందనీ

మనం మార్చగలిగేది

వాచీనీ...తివాచీనీ మాత్రమేనని

ఎరిగిన కాల జ్జానులు

ప్రాజ్జులు ప్రాచ్యులు

మిగిలిన వారు అప్రాచ్యులు

కానీ కాలానుగుణంగా

విజ్జానాన్ని విశ్వవ్యాప్తం చేసిన

విజ్జులు పడమటి సంధ్యా రాగం

ఆలపించిన ఈ వైజ్జానిక వైతాళికులే

మార్చి లో మార్చి

నవంబర్లో సరిదిద్దుతారు

కొన్ని వేల జననాలకి

జెస్టేషన్ పీరియడ్

మరిన్ని వేల మరణాలకి

జస్టిఫికేషన్ పీరియడ్

దాదాపు తొమ్మిది నెలలు

కాల మహిమ కాక పోతే

ఏంటి చెప్పూ

గంట ముందుకీ

గంట వెనక్కీ

తిప్పడం

గతి తప్పడమే

అయితేనేం

శ్రీమంతులు చెప్పేవే

శ్రీరంగ నీతులు

వీళ్ళు కాలాంతకులు

చలి కాలం పోతే

కలి కాలం

- సాయి శేఖర్

Tags:    
Advertisement

Similar News