జీవితమొక సుఖదఃఖాల శతపత్ర చెంగల్వ
రోజూ విరిసి
నేల నుండి నింగిని చూస్తూ అలా
నీటి నుండి తేలి గాలి అలలకి గలగలా నవ్వుతుంది ఆ కలువ
శీలమొక పరువమంత బరువైన శిలువ
దించడానికి వీలుపడదు
మోస్తున్నంత వరకులేదు మరే గొడవ
మనుగడకదే క'దండి' చలువ
ఖరిదైనది కన్నీరు
బొట్టుకూడా దొర్లిపోరాదు కనుగవ
మనసు కలతపడినా
మమత మడతపడినా
కన్నీళ్లు ఒలుకిపోవుట అతిసహజము
కన్నీరు ఒలకని పూలదారేదో అన్వేషించు
ఓ మనసా ! నువ్వు నడవ
కాలమొక చివరంటూలేని
మంచు తొవ్వ
క్షణంక్షణం కరగడమే దాని నైజము
మంచిని,మమతని పంచుతూ
సాగనీయి ఈ సంసార పడవ
చేరాలి మన తీరం శీఘ్రంగా
శ్వాసవున్నంత వరకే కదా
ఈ తోలు విలువ
- నల్లగొండ రమేష్
Advertisement