రవిది సాధారణ మధ్యతరగతి!
ఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా...
చదువుఆగిపోయి...,
బ్రతుకు తెరువుకోసం పదమూడేళ్లకే మోటార్ మెకానిక్ పనిలో
చేరిపోయాడు.... !
తరువాత రెండేళ్లలోనే...
నూనూగు మీసాల వాడ య్యాడు...! ఆ లేత యవ్వన మగతనం ఆడగాలి తగిలితే... రెప - రెప లాడిపోయేవాడు... !
సినిమాలప్రభావం.,
అదంతాప్రేమేఅనే.
భ్రమలోపడిపోయాడు
ఐనా,ధైర్యంచెయ్యటానికిఅతనిసాంఘిక,ఆర్ధికపరిస్థితులుసహ కరించేవి కావు ! వెనక్కి లాగేసేవి !!
పరిస్థితులుతనని వెనక్కులాగి నా...వయసు ఊరుకుంటుందా
దానికదిగానో... స్వయంతృప్తి ప్రయత్నంతోనే ఆవేడంతా దిగిపోయి,పూర్తిగాచల్లబడితే తప్ప ఉండలేని పరిస్థితి... !
ఆ తరువాత,
ఇరవైనాలుగేళ్ల
వయసొచ్చిన తరువాతప్రేమప్రేమగా. అర్ధమవటం
మొదలైంది.కేవలం మనిషిలోని అందాన్నే
కాక... ఆ మనసుని, ప్రవర్తననినచ్చిప్రేమించటంమొదలుపెట్టాడు...!
కాస్త అందము, మాటతీరు ఉండి, ఏదో ఒక ప్రత్యేకత యే అమ్మాయిలోకనిపించినా... సమ్మోహితుడైపోయి, వాళ్లపై ప్రేమను పెంచుకునే వాడు... !
గానీ...., ఇతనిని వాళ్ళెవరూ ప్రేమించినట్టుగానీ, కనీసం అభి మానించినట్టుగాని కనిపించే వారుకాదు...!!
ఆఖరికి ఒకరోజు తెగించి...
అతను బాగా ఇష్టపడిన. రమ్యతో తనమనసువిప్పి చెప్పాడు!ఆమెకూడా తనఅయిష్టతను
మొహంమీదేనిర్మొహమాటంగాచెప్పేసింది... !
రవి చాలా బాధపడ్డాడు !
ఐనా... అతనికి ఆమెపై ఇసుమంతైనాకోపంగానీ,ద్వేషంగానీకలగ లేదు !!
ఆమె ఆనందంగా కనిపిస్తే... పొంగిపోయే వాడు !
ఆమె ముఖంలో ఏమాత్రం బాధకనిపించినారవి విల విలలాడిపోయేవాడు... !!
కొద్దిరోజులకే రమ్యకు పెళ్లిజరిగిపోవవటంతో...
రవిజీవచ్ఛవమే
అయిపోయాడు !
ఆ బాధనుండి అతను కోలుకోటానికి ఆరు నెలలు పట్టింది !
ఒకరోజు... రమ్య రోడ్డుపై
దీనంగా మోడువారిన చెట్టులా కనిపించేసరికి తట్టుకోలేక పోయాడు ! బొంగురుపోయిన గొంతుతో ఏం జరిగింది అని రమ్యను అడిగాడు...,మొదట
చెప్పటానికి నిరాకరించినా...
తరువాత ఆమె చెప్పింది విని చాలా బాధ పడ్డాడు !
రవి బాగా ఆలోచించాడు... !
ఒక నిర్ణయానికి వచ్చేసాడు !!
ఎంత వద్దంటున్నా... రమ్యకునచ్చజెప్పి...
తనకిడ్నీనిరమ్యకు
ఇచ్చేసాడు
పెళ్లిచేసుకున్నభర్త,తనుబాగున్న కొద్దిరోజులు అనుభవించి... ఆమె కష్టంలో ఉన్నపుడు. ఆదు కోకపోగా రోగిష్టి పెళ్లాంతో కాపురంచేయలేనని వదిలేస్తే..., మనసారా ప్రేమించిన రమ్య ఆనందమే తనఆనందంగా బ్రతి
కినరవి... ఆమెకు తన కిడ్నీనిఇచ్చి...బ్రతికించటమే కాకుండా పదిమంది పెద్దల ఎదుటా ఆమె మెడలో తాళికట్టి అర్ధాంగిగా చేసుకున్నాడు
అనేస్తే చాలదు రవి ప్రేమను బ్రతికించాడు...
అనటమే సమంజసమేమో !
- కోరాడ నరసింహారావు
(విశాఖపట్నం)