ఒక ముసుగు అయితే పర్వాలేదు
ఒకే మనిషికి ఇన్ని ముసుగులా..?
పలకరించేటప్పుడే ముఖానికి
ఒక కృత్రిమపు నవ్వుమొహం
ముసుగుని తొడుక్కుంటాడు..!
సినిమా అయిపోగానే బొమ్మ
మాయమైపోయినట్లు
పలకరింపు అయిపోగానే ఆ నవ్వు
మాయం అయిపోద్ది..!
కన్న తల్లిదండ్రుల దగ్గర ఒక ముసుగు ..
కట్టుకున్న భార్య దగ్గర ఒక ముసుగు..
స్నేహితుల దగ్గర ,బంధువుల దగ్గర కూడా ముసుగులే..
ఎవరి దగ్గరా హృదయపూర్వకంగా
ప్రవర్తించే పద్ధతి లేనేలేదు..
మనిషికి హాయిగా, మనస్ఫూర్తిగా
నవ్వుకునే రోజు ఎప్పుడు వస్తుందో
ఈ కృత్రిమపు నవ్వులతో
పలకరించే రోజులు ఎప్పుడుపోతాయో..!
మనిషి అన్నాక మొహం లో
కాసింత నవ్వు ఉండాలి కదా..!
సీరియస్ గా మొహం పెట్టుకుంటే
సీరియల్లో విలన్ కి వాడికి తేడా ఏముంటుంది..!
ఎటువంటి ముసుగుల్లేని ముఖాల
మనుషులు కావాలి..!
స్వచ్ఛంగా మనసారా నువ్వే ఒక
నవ్వు మొహం కావాలి...!
- జి.రంగబాబు
(అనకాపల్లి)