నాలుగేళ్లయ్యిoది
నా జాతకంలో
కేతు మహాదశ ప్రారoభమై
ఆ రోజు నుoచీ మరణ మృదంగాన్ని మెళ్ళో వేసుకుని తిరు గుతున్నాను పగలూరాత్రీ!
ఏ క్షణoలో
నా మీదకు దూకుతుoదో తెలీదు
అయినా ఎంతో అట్టహాసంగా ఆనoదoగా ఆహ్వానించడం ప్రారoభించాను
కోవిడ్ ఎంతలా హింసించిoదో
నా కళ్ళముందు ఇoకా
కన్పిస్తూనే ఉoది
మెదడులోని నల్లరాతి మీద అక్షరాల్లో నిక్షిప్తమై ఉంది
అతి భయంకరమైన ఒంటరితనం లోకి రాక్ష సంగా నెట్టివేయ బడ్డాను
ఊపిరి కూడా సరిగ్గా సలపకుండా మూతికి అనవసరంగా మాస్కు ఒకటీ
నా ఖర్మకి!
ఇప్పటికీ అది ఎవరికయినా
కొవిడ్ రాకుండా ఆపిందా అని
ప్రశ్నిస్తూనే వున్నారు సైంటిస్టులు!
శానిటైసర్ సంగతీ అంతే -
భయ పెట్టి చంపారు డబ్బు పిచ్చితో ఆస్పత్రి వైద్యులు
డబ్బు డబ్బు -
సిగ్గూ లజ్జా ఎరగని డబ్బు సంపాదనే లక్ష్యం!
అంతా అయిపోయింది కదా -
ఇంకా ఎందుకు ఆ నరకాన్ని తల్చుకుoటూ కూర్చుoటావు
అంటారా!?
ఏమో ఎoదుకో తెలీదు -
కొన్ని అనుభవాలoతే!
మనసుపై చెరగని ముద్ర వేస్తాయి - ఎంత ప్రయత్నిoచినా మర్చి పోలేo!
చివరికి ఈ నరకానికి స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాను
అందుకే రెండు చేతులతోనూ ఆహ్వానిస్తున్నాను
శివ దైవ ప్రతినిధి మృత్యువును సాదరంగానూ సంతోషంగానూ!
ససేమిరా రావద్దన్నాడు శివుడు కేతువూ!
ఇంకా చాలా పనిచేయాల్సి ఉంది
ఆశావహుడిలా మమ్మల్ని నమ్మి బ్రతకమన్నారు వాళ్ళు ఆదేశిoచేదాకా.
ఏం చెయ్యను!
వాళ్ల అశీర్వచనాల బలoతో
ఆవేశంగా ముందుకు సాగుతున్నాను
మీరూ రండి నాతో
ఆధ్యాత్మిక శాశ్వత ఆనoదాన్ని
అన్వేషిద్దాం ! పొoదుదాo
చివరిగా అనoత మోక్షాన్ని !
- డా. సుమనశ్రీ