కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుల నియామకం

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులను ఈ రోజు నియమించింది.

Advertisement
Update:2023-04-05 18:11 IST

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులను ఈ రోజు నియమించింది.  వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.

సభ్యులుగా  సీనియర్ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం;

పి.జి.పాఠ్యపుస్తకాల సంపాదకులు, రచయిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.రఘు;

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు కె. లావణ్య;  

వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు ప్రముఖ కథా రచయిత్రి, వినోదిని;

సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కథా  నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు;

ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్ గార్లను

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ రావు నియమించారు.  వీరి నియామకం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సాహిత్యాభిమానులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News