అనుక్షణికం

Advertisement
Update:2023-02-05 21:52 IST

1

మరీ దీర్ఘమై పోయిన సాయంత్రం

యెంతకీ

పడమటి గూడు వదిలిపెట్టని సూర్య పక్షి.

యెందుకు ఎదురుచూస్తావో

అప్పుడప్పుడూ కొంత చీకటి కోసం!?

2

దిగంతం వొంపు దగ్గిర

నది మెరుపు తీగ మీటుతుంది.

ఆ రెండే కదా

నీ చూపులో నెమ్మదిగా లీనమయ్యే క్షణిక దీపాలు!

చాలా అనుకుంటూ

కొంత మాత్రమే పలికే ఆకాశం

యేమీ అనుకోకుండానే

నేలంతా వొలికే నీలి కెరటం

నన్ను కట్టిపడేస్తుంది యీ పూటకి

యీ రాత్రికి-

3

యిప్పటికీ నువ్వొక వూహేనా

అంటే

కానే కాదని

ఎంత అందంగా సిగ్గుపడి

వెళ్ళిపోతుంది కదా

యీ సాయంత్రం!

-అఫ్సర్ (ఫిలడెల్ఫియా)

Tags:    
Advertisement

Similar News