జగన్ హింటిచ్చారు.. మంత్రులు పాటిస్తున్నారు
అంబటి ఆ పుండుపై మరింత కారం చల్లారు. పవన్ కల్యాణ్ ని సార్థక నామధేయుడంటూ వెటకారం చేశారు.
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారంతో ఏపీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. కానీ పదే పదే పవన్ పెళ్లిళ్లు, పెళ్లాలు అంటూ వెటకారాలాడటం మాత్రం మానలేదు. పోనీ వైసీపీ సోషల్ మీడియాకే ఈ ఆరోపణలు పరిమితమా అంటే అదీ లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా పదే పదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యాఖ్యలు కాస్త తగ్గాయి. పవన్ ని ప్యాకేజీ స్టార్ అనడం వరకే పరిమితం అయ్యారు నాయకులు. కానీ అమ్మఒడి సాక్షిగా సీఎం జగన్ మరోసారి నలుగురు పెళ్లాలు, నాలుగేళ్లకోసారి పెళ్లాల మార్పిడి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మంత్రులు కూడా లైన్లోకి వచ్చారు. జగన్ అలా కామెంట్ చేశారో లేదో, ఇలా వంత పాడుతూ ట్వీట్ వేశారు మంత్రి అంబటి రాంబాబు.
పవన్ కళ్యాణ్
పవన్ + కళ్యాణ్
పవన్ = గాలి , గాలి, గాలి
కళ్యాణ్ = కళ్యాణాలు
సార్థక నామధేయుడు !
ఇదీ అంబటి వేసిన ట్వీట్. ఈ ట్వీట్ మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఆల్రడీ సీఎం జగన్ స్టేట్ మెంట్ తో జనసైనికులు రెచ్చిపోతున్నారు. అసలు పవన్ వ్యక్తిగత విషయాలు మీకెందుకని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు రాజారెడ్డి ఫ్యామిలీ హిస్టరీ చెబుతామంటూ ఘాటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో అంబటి ఆ పుండుపై మరింత కారం చల్లారు. పవన్ కల్యాణ్ ని సార్థక నామధేయుడంటూ వెటకారం చేశారు.
భీమవరంలో గట్టిగా బదులిస్తారా..?
సీఎం జగన్, కురుపాం మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలకు భీమవరం నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ బదులిచ్చారు. అయితే ఆయన కేవలం తన హావభావాల విషయంపైనే స్పందించారు. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. చాలా అంటే.. అందులో ముఖ్యమైన విషయం వివాహాల గురించే. రెండు రోజుల గ్యాప్ లో వైసీపీ నేతలు మరిన్ని తప్పులు చేస్తారని పవన్ చెప్పినట్టే.. అటువైపు నుంచి మరిన్ని విమర్శలు వినపడుతున్నాయి. వీటన్నిటికీ పవన్ భీమవరంలో బదులు చెప్తారనే అంచనాలున్నాయి. ముఖ్యంగా వివాహాల గురించి వచ్చే విమర్శలపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడే అవకాశముంది.