`యాత్ర` డైరెక్టర్‌పై ఎల్లోమీడియా ఏడుపు

మహీ వీ రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డట. ఈయన తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు అని గోలచేస్తోంది. తల్లిది పులివెందుల, పైగా రెడ్డి కూడా కాబట్టి మనోడని తెలిసి అడగటంతోనే జగన్ హార్సిలీహిల్స్‌లో భూమిని దోచిపెట్టేస్తున్నాడంటూ నానా యాగీ చేస్తోంది.

Advertisement
Update:2024-02-12 10:30 IST

`మహీ.. మనోడే` పేరుతో ఒక కథనం రాసి ఎల్లోమీడియా బోరుమని ఏడుస్తోంది. దీనికి కారణం ఏమిటంటే.. మదనపల్లిలోని హార్సిలీహిల్స్ లో మహీ వి రాఘవ అనే డైరెక్టర్‌కు ప్రభుత్వం స్టూడియో నిర్మాణానికి కొంత భూమి ఇస్తోందట. ఇంతకీ ఈ మహీ ఎవరంటే యాత్ర, యాత్ర-2 సినిమాలు తీసిన డైరెక్టర్ అట. సినిమా తీయటంలో, ప్రభుత్వ భూమిని దోచిపెట్టడంలో జగన్మోహన్ రెడ్డి-మహీ వీ రాఘవ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఎల్లోమీడియా నానా రచ్చచేస్తోంది.

మహీ వీ రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డట. ఈయన తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు అని గోలచేస్తోంది. తల్లిది పులివెందుల, పైగా రెడ్డి కూడా కాబట్టి మనోడని తెలిసి అడగటంతోనే జగన్ హార్సిలీహిల్స్‌లో భూమిని దోచిపెట్టేస్తున్నాడంటూ నానా యాగీ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. స్టూడియోలు కట్టుకోవటానికి సినీ ప్రముఖులకు ప్రభుత్వ భూమిని ఇవ్వటం చాలా కాలంగా ఉన్నదే. రామానాయుడు, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ లాంటి ప్రముఖులు ఏదో పేరుచెప్పి విలువైన భూములను ప్రభుత్వం నుండి తీసుకున్నవారే.

అలాగే ఎల్లోమీడియా యాజమాన్యాలు కూడా చంద్రబాబునాయుడు హయాంలో కోట్లరూపాయలు విలువైన ప్రభుత్వ భూములను తీసుకోలేదా..? ఇంతమంది ప్రభుత్వ భూములను తీసుకున్నప్పుడు ఇప్పుడు మహీ వీ రాఘవకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే ఎల్లోమీడియా ఎందుకు ఏడుస్తోందో అర్థ‌కావటంలేదు. మహీకి జగన్ మధ్య జరుతున్నది క్విడ్ ప్రోకో అయితే గతంలో చంద్రబాబుకు సినీప్రముఖులకు, ఎల్లోమీడియా యాజమాన్యాలకు మధ్య జరిగింది కూడా క్విడ్ ప్రోకోనే.

రామోజీ ఫిల్మ్ సిటీ పేరుతో ఉన్న భూమి ప్రభుత్వానిది కాదా..? ఆ భూముల్లో ఉన్న పేదలను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేసి ఎల్లోమీడియా యాజమాన్యానికి అప్పగించలేదా..? మరో ఎల్లోమీడియా యాజమాన్యం చంద్రబాబు దగ్గర తనకున్న పలుకుబడితో వైజాగ్, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువైన భూములు తీసుకోలేదా..? తాము లేదా తమ వాళ్ళు ప్రభుత్వ భూములు తీసుకుంటే సమాజహితం అదే జగన్ హయాంలో ఎవరైనా స్టూడియోల కోసం భూములు తీసుకుంటే మాత్రం క్విడ్ ప్రోకోనా..?

Tags:    
Advertisement

Similar News