ఆయన స్కామ్ అంటారు.. వీరు కామ్‌గా వుంటారు
త్వరలో వైసీపీ సర్కారులో జరిగిన ఓ భారీ కుంభకోణాన్ని బయటపెడతానని నారా లోకేష్ బహిరంగంగానే ప్రకటించారు. దీనిపైనా వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
రాజకీయం అంటేనే విమర్శకి ప్రతివిమర్శ, ఆరోపణకి ప్రత్యారోపణ. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కట్టుబాట్ల కట్లు తెంచుకుని విశృంఖల బూతుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. నీయమ్మామొగుడు అని అంటే...బోస్డీకేతో సమాధానం ఇస్తున్నారు. ఇన్‌స్టంట్ రియాక్షన్స్‌కి వేదికైన ఏపీ పాలిటిక్స్‌లో ఒక విషయంలో మాత్రం వైసీపీ నుంచి మౌనమే సమాధానం అవుతోంది. ఇది వ్యూహాత్మకమా? అదను కోసం నిరీక్షణ అనేది మాత్రం తెలియడంలేదు. టీడీపీ నిర్వహించిన మహానాడు సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..వైసీపీ పాల్పడిన ఓ భారీ కుంభకోణాన్ని బయటపెట్టబోతున్నానని తమ అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. దీనికి వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మేం పారదర్శకంగా ఉన్నాం, మమ్మల్ని ఏం పీకలేవు అనే కౌంటర్ వస్తుందని వైసీపీ కేడర్ ఊహించింది. అలాంటిదేమీ జరగలేదు.
దీంతో నారా లోకేష్ స్కామ్ అంటుంటే వైసీపీ లైట్ తీస్కుందా? నిజంగానే ఏదైనా పెద్ద కుంభకోణానికి పాల్పడిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నెలలు గడిచింది. లోకేష్ ఏం స్కామూ బయటపెట్టలేదు. వైసీపీ లిక్కర్ దందా గురించి పార్టీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. చాలా రోజుల తరువాత గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరోగ్య సంజీవని పేరుతో ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా త్వరలో వైసీపీ సర్కారులో జరిగిన ఓ భారీ కుంభకోణాన్ని బయటపెడతానని బహిరంగంగానే ప్రకటించారు. దీనిపైనా వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
అసలూ ఏ కుంభకోణమూ జరగలేదా? లేదంటే నారా లోకేష్ ప్రకటనలకి హైప్ ఇవ్వడం ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ...వైసీపీ శిబిరం నుంచి ఖండనా లేదు.. ఎదురు దాడీ లేదు. టీడీపీలో మాత్రం నారా లోకేష్ ఏం స్కామ్ బయటపెడతారోననే ఆతృతతో కేడర్ నుంచి లీడర్ వరకూ ఎదురు చూస్తున్నారు.