తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి
తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
Advertisement
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడవద్దని సూచించారు. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని, మరింత మెరుగుపడాలని అన్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికిపైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణ కోసం ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Advertisement