టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. ట్రోలింగ్ ఎందుకంటే..?

హీరో నిఖిల్ ఎప్పుడూ తన కులం ఇదీ అని చెప్పుకోలేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా పేరు తెచ్చుకున్నారు. కార్తికేయ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.

Advertisement
Update:2024-03-29 21:37 IST

హ్యాపీడేస్ ఫేమ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ టీడీపీలో చేరారు. నారా లోకేష్ ని కలసి ఆయనకు పూలకుండీ ఇచ్చి, పచ్చ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు, ఎవరికైనా జై కొట్టొచ్చు. కానీ హీరో నిఖిల్ చేరిక సందర్భంగా టీడీపీ అఫిషియల్ ఖాతానుంచి వేసిన ట్వీట్ మరీ దారుణంగా ఉంది. హీరో నిఖిల్ సిద్దార్థ్ యాదవ్ టీడీపీలో చేరారంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.


అసలిక్కడ హీరో నిఖిల్ కులాన్ని ప్రస్తావించడం దేనికి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హీరో నిఖిల్ యాదవ కులానికి చెందిన వ్యక్తి అని అందరికీ అర్థమయ్యేలా టీడీపీ ట్వీట్ చేసింది. అంటే సదరు హీరో కులానికి చెందిన వారిని ఆకట్టుకోడానికి చేసిన ప్రయత్నమే ఇది అనుకోవాలి. అయితే ఈ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. అంతా బాగానే ఉంది కానీ, కులప్రస్తావన ఎందుకయ్యా అంటూ నిలదీస్తున్నారు చాలామంది. అందులో టీడీపీ అభిమానులు కూడా ఉండటం విశేషం.

సినీ ఇండస్ట్రీలో కులాల ప్రస్తావన ఉన్నా.. టాలెంట్ ని మించింది కూడా ఏదీ లేదనే విషయం అందరికీ తెలుసు. హీరో నిఖిల్ ఎప్పుడూ తన కులం ఇదీ అని చెప్పుకోలేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా పేరు తెచ్చుకున్నారు. కార్తికేయ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అలాంటి హీరో తమ పార్టీలో చేరితో కులం పేరుని హైలైట్ చేస్తూ ట్వీట్ వేయడమేంటని అభిమానులు ఫీలవుతున్నారు. హీరో నిఖిల్ మామ కొండయ్య యాదవ్, చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఈ చేరిక తప్పనిసరిగా మారిందని తెలుస్తోంది. మామ గెలుపుకోసం అల్లుడు నిఖిల్ టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News