ఏపీలో ఫ్యాన్ సునామీ.. టైమ్స్ నౌ ఇంట్రెస్టింగ్ సర్వే..!
వైసీపీ 47.6 శాతం ఓట్లు దక్కించుకుంటుందని సర్వే రిప్టోర్టు తెలిపింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కూటమి కట్టినప్పటికీ.. 44.4 శాతం ఓట్లు మాత్రమే పొందుతారని తేల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులేస్తున్నారు. అభ్యర్థులను ఎంపికను దాదాపు పూర్తి చేసి.. సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ రణభేరిని మోగించారు వైసీపీ అధినేత. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. పొత్తుల కోసం పాకులాడుతున్నారు. అయితే తాజాగా ఏపీలో లోక్‌సభ సీట్లకు సంబంధించి సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో 19 ఎంపీ స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని తేల్చింది. ఇక తెలుగుదేశం - జనసేన కూటమి మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని అంచనా వేసింది. కూటమికి కేవలం 6 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశముందని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.
వైసీపీ 47.6 శాతం ఓట్లు దక్కించుకుంటుందని సర్వే రిప్టోర్టు తెలిపింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కూటమి కట్టినప్పటికీ.. 44.4 శాతం ఓట్లు మాత్రమే పొందుతారని తేల్చింది. జాతీయ పార్టీలు బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ 1.5 శాతం ఓట్ షేర్ దక్కే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ఇక టైమ్స్ నౌ సర్వేను వైఎస్సార్ సీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ పెద్దగా తేడా ఉండదని.. ఏపీలో వైఎస్ జగన్‌దే విజయమని ట్వీట్ చేసింది. ఏపీ ఎన్నికలపై సర్వే చేసిన చాలా సంస్థలు వైసీపీదే విజయమని స్పష్టం చేశాయి. ఇక ఈ సర్వేలు వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి.