ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య‌ కేసులో దోషికి ఉరిశిక్ష విధించిన ఒంగోలు కోర్టు

జులై8, 2021లో గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో కూతురు వరసయ్యే ఓ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసిన దూదేకుల సిద్ధయ్య అనే వ్యక్తి అనంతరం ఆ చిన్నారి మరణించడంతో శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు.

Advertisement
Update:2023-01-26 11:08 IST

ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యచేసిన కేసులో ఓ కామాంధుడికి ఉరిశిక్ష విధించింది.

జులై8, 2021లో గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో కూతురు వరసయ్యే ఓ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసిన దూదేకుల సిద్ధయ్య అనే వ్యక్తి అనంతరం ఆ చిన్నారి మరణించడంతో శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు.

ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దూదేకుల సిద్ధయ్యనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని నిర్దారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపారు. కేసు విచారించిన ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్‌చార్జ్) ఎంఏ సోమశేఖర్ దూదేకుల సిద్ధయ్య కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

అంతే కాక, బాధిత‌ బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెప్పించాలని ప్రభుత్వాన్నిఆదేశించింది కోర్టు. మరో వైపు ఈ కేసు విచారణలో అద్భుత ప్రతిభ కనబర్చిన

అప్పటి దిశ స్టేషన్ డీఎస్పీ ధనుంజయుడు, సీఐ ఎండీ ఫిరోజ్, కోర్టు లైజన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు.

Tags:    
Advertisement

Similar News