జనసేన కార్యకర్తలపై ‘దేశం’ కుర్రాళ్ల దాడి
కూటమి అంటే ఇదేనా, మా కార్యకర్తనే అన్యాయంగా కొడతారా అని జనసేన నాయకులు నిలదీశారు. పైగా ఆ సభలో అన్నీ తెలుగుదేశం పసుపు జెండాలే.
ఉత్సాహవంతుడైన ఆ కుర్రాడు చేసిన పాపం ఏమీ లేదు. సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ అని నినాదాలు ఇచ్చాడు. అది తెలుగుదేశం బహిరంగ సభ. అటు చంద్రబాబు నాయుడు వేదిక మీదే ఉన్నారు. ఆ సభలో జనసేన కార్యకర్తలూ ఉన్నారు. పవన్ని సీఎం, అంటావా..? అంటూ రెచ్చిపోయిన కొందరు తెలుగుదేశం యువకులు జనసేన కార్యకర్తని కొట్టారు. మీదపడి చెత్త చెత్తగా కుమ్మేశారు. అది చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడిపల్లిలో మంగళవారం నాడు జరిగిన సభ. అసలే జనంలేక వెలవెలబోతోంది సభా ప్రాంగణం. చంద్రబాబు చాలా అసహనంగా ఉన్నారు. అప్పటికీ డబ్బులిచ్చీ, మందుసోసీ కొందర్ని సభకి రప్పించగలిగారు. తాగివచ్చిన ‘దేశం’ కుర్రాళ్లు ఆడవాళ్ల మీదకెళ్లారు. వీళ్లతో ఎందుకొచ్చిన గొడవ అని మహిళలు లేచి సభ నుంచి వెళ్లిపోయారు.
కూటమి అంటే ఇదేనా, మా కార్యకర్తనే అన్యాయంగా కొడతారా అని జనసేన నాయకులు నిలదీశారు. పైగా ఆ సభలో అన్నీ తెలుగుదేశం పసుపు జెండాలే. తెలుగుదేశం జనసేనకి ఇస్తున్న గౌరవం ఏంటో జనసైనికులకు బాగా అర్థం అయింది. కాపులంటే మా జెండా మొయ్యాలి తప్ప పదవులూ, గిదవులూ అని డిమాండ్ చేస్తే తన్నక వూరుకుంటామా..? అని ‘దేశం’ వాళ్లు గట్టిగానే అంటున్నారు. అనగా కాపులు ఆశించే స్థాయిలోనే ఉండాలిగానీ, శాసించే స్థాయిలో ఉంటే ఒప్పుకోడానికి మేం వె్రరిపప్పులం అనుకుంటున్నారా అని ఆధిపత్య తెలుగు కులం వారు రెచ్చిపోతున్నారు.
ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం గుమ్మం ముందు, ‘మాకెన్ని సీట్లు ఇస్తారూ..’ అంటూ పవన్ కళ్యాణ్ దేబిరించడం ఎంత దరిద్రంగా ఉందో తెలుస్తూనే ఉందిగా అని కాపు నాయకులు ఆవేదనతో చెబుతున్నారు. మాజీ మంత్రి, ప్రసిద్ధ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఒక అడుగు ముందుకువేసి, తెలుగుదేశం ఛానళ్లూ, పేపర్లూ జనసేనకి 25 సీట్లే అని ప్రతిరోజూ చెబుతున్నా ఎవరూ ఖండించడం లేదు. ఎన్నిఇచ్చినా సరే అనే మైండ్ సెట్‌లో ఉంటే, ఇది జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం అవుతుంది. గతంలో మిత్రపక్షాలకు 20–30 సీట్లు మాత్రమే ఇచ్చి ఎదగకుండా తొక్కేసిన చంద్రబాబుని మళ్లీ 25–30 సీట్లు ఇస్తే నమ్మడం అంటే మనమే చంద్రబాబు చేతికి కత్తి ఇచ్చి, దయచేసి మా గొంతు కోయరూ.. అని అడిగినట్టు ‘‘ఉంటుంది’’ అని చెప్పారు.
కాపుల్ని ‘జెండా కూలీలు’ అంటున్నారు తెలుగుదేశం వాళ్లు కసిగా..! చంద్రబాబుకి వేలకోట్లూ, పవన్ కళ్యాణ్‌కి వందల కోట్లూ.. మధ్యలో కాపులే కదా చంకనాకిపోయేది. కమ్మ రాజకీయాల్ని నమ్ముకున్నోడు బాగుపడిన దాఖలా తెలుగు ప్రజల చరిత్రలో లేదా కదా..!