పురుగుల మందు తాగొద్దు.. వెళ్లి రైలు పట్టాల మీద పడుకో- ఎమ్మెల్యే పెద్దారెడ్డి సలహా
వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇక తాడిపత్రి వదిలేసి తిరిగి గద్వాల్ వెళ్లి గతంలో లాగా దొంగతనాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
తనపై పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే జేసీ బ్రదర్స్ గతంలో తన అన్న సూర్య ప్రతాపరెడ్డిని హత్య చేయించారని, అందుకు ప్రతిఫలంగా హత్య చేసిన వారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారని పెద్దారెడ్డి గుర్తుచేశారు. అయినా సరే తాము సంయమనం పాటించామని చెప్పారు. తాను కక్ష తీర్చుకోవాలని అనుకుంటే గంట పనే, మీ ఇంట్లోకి వచ్చిన వాడిని.. మీ బెడ్ రూమ్ లోకి రాలేనా..? అని హెచ్చరించారు.
ఈ మాటలు తాను అధికారంలో ఉన్నామన్న ధీమాతో చెప్పడం లేదని, అధికారం ఉన్నా, లేకున్నా సరే తనమీద కారు కూతలు కూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటికెళ్లి చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.
రాజకీయాల కోసం 30 ఏళ్లుగా గ్రామాల్లో ఎన్నో హత్యలు చేయించిన వ్యక్తులు జేసీ బ్రదర్స్ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో మట్కా నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకుంటూ వారిని వెనుకేసుకొస్తూ, చివరకు మట్కా నిర్వాహకుల్ని పట్టుకునేందుకు వచ్చిన పోలీస్ జీపుల్ని కూడా దగ్ధం చేయించిన చరిత్ర వీరికి ఉందని పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. పెద్దారెడ్డి బట్టలు ఊడదీస్తా అని ఇటీవల ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యే బట్టలు విప్పుతూ ఉంటే చూడ్డానికి ఇదేమైనా ద్వాపరయుగం అనుకుంటున్నావా?.. నేనేమైనా ద్రౌపది అనుకుంటున్నావా..? అని పెద్దారెడ్డి ఫైరయ్యారు. నా బట్టలు ఊడదీసేందుకు వచ్చే వ్యక్తి చేయి తెగి పడుతుందని హెచ్చరించారు.
పక్కన మనిషి లేకుంటే నడవడం కూడా చేతకాని ప్రభాకర్ రెడ్డా నా బట్టలు ఊడదీసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇక తాడిపత్రి వదిలేసి తిరిగి గద్వాల్ వెళ్లి గతంలో లాగా దొంగతనాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ బతుకు బతకడం కంటే వారి ఇంటికి పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉందని ఒకరోజు వెళ్లి పట్టాల మీద పడుకుంటే అంతా ముగిసిపోతుందని.. పురుగుల మందు లాంటిది తాగవద్దని.. అలా తాగితే మళ్ళీ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.