కడప ఎస్పీ హర్షవర్ధన్‌ ఆకస్మిక బదిలీ

Sudden transfer of Kadapa SP Harshavardhan

Advertisement
Update:2024-11-06 17:59 IST

ఏపీలోని కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదలి వేయడం పట్ల కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు కడప జిల్లాలో మరో సీఐని కూడా ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా జిల్లా పోలీసులపై ఫైర్‌య్యారు.

ప్రభుత్వ ఆదేశాలమేరకు కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్‌తో సమావేశమై వర్రా రవీంద్రారెడ్డి కేసు గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి ఉండగా రవీంద్రారెడ్డి విచ్చలవిడిగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, వంగలపూడి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా అతడిపై మంగళగిరి, హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణకు రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకని 41-ఏ నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు.

Tags:    
Advertisement

Similar News