కాల్ మనీకి పాల్పడితే కఠిన చర్యలు : అనిత

ఏలూరు కాల్ మ‌నీ ఘ‌ట‌న‌పై స్పందించిన హోంమంత్రి వంగ‌ల‌పుడి అనిత.. అధిక వ‌డ్డీలు, అక్ర‌మ‌ వ‌సూలు చేస్తే స‌హించేది లేద‌ని, అలాంటి వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Update:2024-10-02 14:54 IST

ఏపీలో కాల్ మనీ వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చారించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ తల్లిని దర్శించుకొని దసరా నవ రాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అధిక వడ్డీలు, అక్రమ వసూలు చేస్తే సహించేది లేదని అలాంటి వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు. సామాన్య పేద ప్రజలు మిత్తి పేరుతో ఇబ్బంది పెట్ట‌రాద‌ని అన్నారు. కిస్తీల‌కు ముందే వ‌డ్డీ కోత‌, గ‌డువు దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై హోంమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైసీపీ నాయకుల మ‌నీ దందాకు తాము బ‌ల‌య్యామ‌ని ఇటీవ‌ల ఏలూరులో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న అప్పుకు అధిక వ‌డ్డీలు క‌ట్టించుకున్నార‌ని వాపోయారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్ గా జరిగే వడ్డీ వ్యాపారాలను కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంటుందని అనిత హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News