టీడీపీ నేత హత్య కేసులో సంచలన నిజాలు

. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్‌, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.

Advertisement
Update:2024-08-18 12:33 IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో 14వ తేదీ జరిగిన టీడీపీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఆయన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టీడీపీలో శ్రీనివాసరావుకు దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేక.. కక్షగట్టి కిరాతకంగా చంపినట్లు నిర్ధారణ అయింది. టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరు మైనర్లకు శ్రీ‌నివాసరావు హత్యతో ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. నేడోరేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్‌, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.

వివరాల్లోకి వెళ్తే..

శ్రీనివాసరావు హోసూరు మాజీ సర్పంచ్. ఇతనికి CRPF రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, టీడీపీ నేత నర్సింహులుతో కొంత కాలంగా విభేదాలున్నాయి. టీడీపీలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య స్థానికంగా చాలా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఓసారి నర్సింహులును శ్రీనివాసరావు చెప్పుతో కొట్టాడు. అప్పటి నుంచి శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు నర్సింహులు. తాజాగా శ్రీనివాసరావుకు వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఇది జీర్ణించుకోలేక పోయిన నర్సింహులు గ్రామానికి చెందిన మరో నలుగురు టీడీపీ నేతల సహకారంతో శ్రీనివాసులును హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన టైంలో రాడ్లతో కొట్టి చంపేశారు.

Tags:    
Advertisement

Similar News