వెనక్కి తగ్గిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ నైతిక విజయం

వైసీపీ చేసిన న్యాయపోరాటం ఫలించింది. వైసీపీ కోర్టుకెక్కడంతో ఈసీ వెనక్కు తగ్గింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో జారీ చేసిన మెమోలను వెనక్కు తీసుకుంది.

Advertisement
Update:2024-05-30 18:59 IST

పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు విషయంలో వైసీపీ నైతిక విజయం దక్కించుకుంది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టింగ్ అధికారి సంతకం, సీల్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మెమోలపై అభ్యంతరాలు తెలుపుతూ వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అప్పటికీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోయే సరికి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చే సరికి ఈసీ వెనక్కు తగ్గింది. ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్టు ఏపీ హైకోర్టుకి ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఈ వివాదం సమసిపోయింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టాంప్ వేయకపోయినా అటెస్టింగ్ ఆఫీసర్ పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాల్సి ఉంటుంది. గతేడాది(2023) జులై 19న కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా సీఈఓ మెమోలు ఇచ్చారు. సంతకం ఉంటే సరిపోతుందని, ఆ సంతకం సరైనదో కాదో తేల్చుకుంటే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధం అని చెప్పింది. చివరికి న్యాయపోరాటానికి దిగింది.

వైసీపీ నైతిక విజయం..

ఎన్నికలకు ముందు వైసీపీ సాధించిన నైతిక విజయం ఇది అని అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారులు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా టీడీపీకి అనుకూల నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై వైసీపీ చేసిన న్యాయపోరాటం ఫలించింది. వైసీపీ కోర్టుకెక్కడంతో ఈసీ వెనక్కు తగ్గింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో జారీ చేసిన మెమోలను వెనక్కు తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News