పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది. తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Update:2022-11-12 15:34 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఇప్పటం గ్రామానికి వెళ్లే సమయంలో పవన్ అనుసరించిన తీరుపై ఈ కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్ కారు డ్రైవర్‌పైనా కేసు బుక్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది. తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పవన్‌ కల్యాణ్‌పై ఐపీసీ 336, 177 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటం గ్రామానికి వెళ్లే సమయంలో పవన్‌ కల్యాణ్ అనూహ్యంగా, సినిమా స్టంట్‌ తరహాలో కారుపై ఎక్కి కూర్చుని వెళ్లారు. హైవే వెంబడి అలాగే ప్రయాణం చేశారు.

పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో శివ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారుపై ఎక్కి ప్రయాణం చేయడం, ఆ సమయంలో హైవే వెంబడి భారీ సంఖ్యలో వాహనాలను వెంటేసుకుని వెళ్లడం, పవన్‌ కల్యాణ్ డ్రైవర్ కారును ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News